అన్వేషించండి
Gunde Ninda Gudi Gantalu Today మార్చి 20 ఎపిసోడ్: మీనాకి సపోర్ట్ గా శ్రుతి, రోహిణి .. బాలుకి ఆహారం అయిపోనున్న కాంతం అత్త - గుండె నిండా గుడి గంటలు మార్చి 20 ఎపిసోడ్ హైలెట్స్!
Gundeninda GudiGantalu Today episode: మౌనిక పుట్టింటివారిని అవమానించేందుకు మేనత్త కాంతాన్నిప్రయోగిస్తాడు సంజయ్. కానీ కాంతం దొంగతనం బయటపడడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది.ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Gunde Ninda Gudi Gantalu March 20th Episode Highlights
1/11

సత్యం కుటుంబాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్న కాంతం..కావాలనే సాంబార్ మీద పోసుకుని మీనాపై నోరు పారేసుకుంటుంది. నువ్వు గొడవపడాలి..నేను నువ్వు కొట్టుకోవాలి శాశ్వతంగా నీ చెల్లెలు ఈ ఇంటికి దూరం కావాలని అనుకుంటాడు సంజయ్
2/11

అన్ని కోట్ల ఆస్తి ఉన్న మీకు ఈ చీర ఓ లెక్కా..అయినా నా భార్య నిజంగా సాంబార్ పోయాలి అనుకుంటే ముఖంపై పోస్తుంది అని కూల్ చెప్పి కడుక్కుని రండి అని పంపిస్తాడు బాలు.
3/11

బాలు రూమ్ లో వాష్ రూమ్ ఎక్కడుందో చూపించి వచ్చేస్తుంది శృతి. లోపల తాళిబొట్టు కొట్టేస్తుంది కాంతం.
4/11

ఎక్కువ సేపు మంచితనం ముసుగువేసుకుని కూర్చోలేను..ఏదో ఒకటి చేయాల్సిందే అంటాడు సంజయ్. ఆ బాలు గాడు మన్నుతిన్న పాములా ఎందుకు కూర్చున్నాడని నీలకంఠం అంటాడు. ఇంతలో వచ్చిన కాంతం తాను తాళి కొట్టేసిన విషయం చెబుతుంది
5/11

దాచేసిన తాళిని తీసుకెళ్లి కార్లో పెడుతుంది కాంతం. ఆ సమయంలో బయట కాల్ మాట్లాడిన శృతి.. సరదాగా ఫంక్షన్ ఏర్పాట్లు వీడియో తీసుకుంటుంది.. ఆ వీడియోలో కాంతం కారు దగ్గరకు వచ్చి లోపలకు వెళ్లడం తీస్తుంది...
6/11

మీనా తాళి తీసుకురా అని ప్రభావతి అంటుంది. లోపల వెతికి వచ్చిన మీనా కనిపించలేదని చెబుతుంది. ఏదైనా పోవాలి అంటే ముందు ఉండాలి కదా రెచ్చిపోతుంది కాంతం. కొన్నారో లేదో సమయానికి పోయిందని అబద్ధం చెబుతున్నారేమో అంటుంది.
7/11

కాంతం ఆగకుండా బాలుని టార్గెట్ చేస్తుంటుంది..ఇంతలో అక్కడకు వచ్చిన శృతి మాదే తప్పే అని మాట్లాడితే అస్సలు ఊరుకోం అంటుంది. మా మీన అలాంటిది కాదంటుంది ప్రభావతి. రోహిణి కూడా మీనా గురించి మాకు తెలుసు అంటుంది.
8/11

చివరిసారిగా మన గదిలోకి ఎవరు వెళ్లారని బాలు అడిగితే..కాంతం అత్తయ్య అని చెబుతుంది మీనా. అంటే అంతా కలసి నన్నే అంటారా అని మరింత రెచ్చిపోతుంది కాంతం. నాకు ఏ బంగారం అవసరం లేదు..గొడవలు వద్దు ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటుంది మౌనిక
9/11

ఈ రచ్చంతా జరుగుతుంటే శృతి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. పుస్తెలతాడు పోయిందని చెబుతాడు రవి. శృతికి అనుమానం వచ్చి కార్లో చూస్తుంది బాక్స్ దొరుకుతుంది. తెచ్చి సైలెంట్ గా ఇస్తుంది
10/11

శృతి కారును ఆన్ చేసి కార్లో బాక్స్ చూసి షాక్ అవుతుంది. పుస్తెలతాడు తీసుకొస్తుంది. మీనాను ఏ ఆధారంతో అన్నారని నిలదీస్తుంది. ఈవిడ మీనాకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తుంది శ్రుతి. తప్పనిసరి పరిస్థితుల్లో సారీ చెబుతుంది కాంతం. ఆ తర్వాత మౌనిక కార్యక్రమం జరుగుతుంది
11/11

గుండెనిండా గుడిగంటలు మార్చి 21 ఎపిసోడ్ లో.. మరోసారి మీనాను టార్గెట్ చేస్తుంది ప్రభావతి. అసలు మీకు ఏం తెలుసు అంటూ ఎంట్రీ ఇచ్చిన శృతి...తాళిని కాంతం దొంగతనం చేసిన సంగతి బయటపెట్టేస్తుంది
Published at : 20 Mar 2025 09:31 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion