Fair Delimitation Meet In Chennai: డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
Fair Deleimitation కోసం దక్షిణాది నినదిస్తోంది. ఎన్డీయేతర పక్షాలు తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో సమావేశమవుతున్నాయి

Fair Delimitation Meet In Chennai | చెన్నై: రాబోయే నియోజకవర్గాల పునర్విభజన సహేతుకుంగా జరగాలంటూ.. దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చేసే పునర్విభజన తమకు అంగీకారం కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి MK Stalin చాలా కాలం నుంచి చెబుతున్నారు. Fair Delimitation కావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో శనివారం చెన్నైలో దక్షిణాది విపక్ష రాష్ట్రాల నేతల సమావేశం మొదలైంది.
తమిళనాడు సీఎం, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) అధినేత, శనివారం జరిగే సమావేశానికి దక్షణాది ముఖ్యమంత్రులు, రాజకీయ పక్షాల నేతలతో పాటు.. ఫెయిర్ డీలిమిటేషన్ సమర్థిస్తున్న ఇతర రాజకీయ పక్షాలను కూడా ఆహ్వానించారు. డీఎంకే ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. చెన్నై వేదికగా స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు.
Today will be etched in history as the day when states that have contributed to our nation’s development came together to safeguard its federal structure by ensuring #FairDelimitation.
— M.K.Stalin (@mkstalin) March 22, 2025
I warmly welcome all Chief Ministers and political leaders to this meeting, united in our… pic.twitter.com/s35eg8Tw7g
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సమావేశానికి హాజరయ్యారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతో పాటు.. శిరోమణి అకాలీ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్విందర్ సింగ్ భుందర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (కేరళ) ప్రధాన కార్యదర్శి P M A సలాం సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మొత్తం 7 రాష్ట్టాల నుంచి 14 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
సమావేశం ఇప్పటికే ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులను స్టాలిన్ తనయడు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్వయంగా ఆహ్వానించారు దక్షిణాది సమావేశంపై స్టాలిన్ Xవేదికగా స్పందించారు.
“ఈ రోజు, దేశ అభివృద్ధికి కీలకంగా తోడ్పడిన రాష్ట్రాలు, మన దేశ సమాఖ్య నిర్మాణాన్ని పరిరక్షించేందుకు కలిసొచ్చిన రోజుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. #FairDelimitation కోసం ఈ సమావేశం కీలకం” అని పేర్కొన్నారు. అలాగే, “ఈ సమావేశానికి హాజరయ్యే ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలను నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. మనమందరం #FairDelimitation పట్ల ఒకే దృక్పథంతో కట్టుబడి ఉన్నాం” అని ఆయన తెలిపారు.
కార్యక్రమానికి హాజరైన వారిలో రేవంత్ రెడ్డి, కేటీఆర్, శివకుమార్ లతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఒడిశా మాజీ మంత్రి, బీజేడీ నేత సంజయ్ కుమార్ దాస్ బర్మా, శిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సర్దార్ బల్వందర్ సింగ్ భుందర్, కేరళ ప్రదేశ్ కమిటీ చీఫ్ కె.సుధాకరన్, ఐయూఎంఎల్, కేరళ రాష్ట్ర కమిటీ జనరల్ సెక్రటరీ పీఎంఏ సలాం, కేరళ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఎన్.కే ప్రేమ్ చంద్రన్, ఏఐఎంఐఎం ప్రతినిధి ఇంతియాజ్ జలీల్, కేరళ కాంగ్రెస్ మణి నుంచి జోస్ కె మణి, కేరళ కాంగ్రెస్ నేత కొట్టాయం ఎంపీ జార్జ్ కె ఫ్రాన్సిస్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

