అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
ఇండియా న్యూజీలాండ్ మధ్య జరగబోయే సిరీస్ లో మహమ్మద్ షమీ పేరు లేకపోవడం పెద్ద దుమారం రేపుతోంది. అజిత్ అగార్కర్, సెలక్షన్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై షమీ పర్సనల్ కోచ్ బద్రుద్దీన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.
గాయం కారణంగా గత కొంత కాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కు దూరమైన షమీ దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ లో బెంగాల్ తరపున ఆడుతున్న షమీ, 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా 16 వివికెట్లు తీసాడు. మంచి ఫిట్‌నెస్‌ను, ఫామ్‌ను కొనసాగిస్తుంటే కూడా సెలక్టర్లు షమీని పక్కన పెట్టడంతో క్రికెట్ నిపుణులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కోచ్ బద్రుద్దీన్ మాట్లాడుతూ "అగార్కర్ బృందం తనను మళ్ళీ ఎంపిక చేసేలా ఒక ప్లేయర్ కు ఇంకేం చేయాలి? దేశవాళీలో ఇన్ని వికెట్లు తీసి, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా ఎందుకు ఆలోచిస్తున్నారు? దీని అర్థం వారికి వన్డే జట్టులో షమీ అవసరం లేదనే కదా!" అని ఆవేదన వ్యక్తం చేశారు.





















