అన్వేషించండి

Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam

 టీమిండియాలో గడచిన పది పదిహేనేళ్లుగా ఫీల్డింగ్ అంటే గుర్తొచ్చేది రవీంద్ర జడేజా. కానీ 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత జడ్డూ భాయ్ టీ20 లకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇక అప్పటి నుంచి ఆ లోటు కనిపిస్తున్నా...ఈ వరల్డ్ కప్ లో మాత్రం జడ్డూ లేని లోటును కనపడనివ్వట్లేదు టీమిండియా వైస్ కెప్టెన్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్. బంతి తన రేడియస్ లోకి వెళ్లిందంటే చాలు అది ఎంత కష్టమైన క్యాచ్ అయినా అలవోకగా పట్టేస్తున్నాడు. బక్కపలుచటి దేహంతో ఉండటంతో మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే వేగంగా మూవ్ కాగలటం బాపూకి ఉన్న అడ్వాంటేజ్ కాగా...తనకున్న ఫిట్ నెస్ లెవల్స్ అండ్ స్కిల్స్ తో అద్భుతమైన క్యాచ్ లు తీసుకుంటున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్లో అక్షర్ పట్టిన మూడు క్యాచ్ లు మ్యాచ్ ను మనవైపు తిప్పాయనటంలో సందేహం లేదు. ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్ లాంటి కీలకమైన ఫామ్ లో ఉన్న ప్లేయర్లు బాదిన క్యాచ్ లను పట్టిన అక్షర్ పటేల్ మ్యాచ్ తర్వాత తన ఆ క్యాచ్ లు అందుకుంటున్న టైమ్ లో తన మైండ్ సెట్ ఎలా ఉందో కూడా చెప్పాడు. హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ ను వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేసి పట్టినప్పుడు అది మ్యాచ్ లో బెస్ట్ క్యాచ్ అవుతుందని ప్రౌడ్ గా ఫీలయ్యానని చెప్పిన అక్షర్ పటేల్..మ్యాచ్ అయిపోయే సమయానికి విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్ ను శివమ్ దూబేతో కలిసి పట్టడం అద్భుతంగా అనిపించింది అన్నాడు. విల్ జాక్స్ ఉన్న ఫామ్ కి...మ్యాచ్ లో అతను ఉన్నప్పుడు ఉన్న సమీకరణాలకి అతను ఇచ్చిన క్యాచ్ ను అందుకోవటం తో మ్యాచ్ మలుపు తిరిగిందన్నాడు. అయితే ఆ క్యాచ్ పట్టే సమయంలో తన ఏకాగ్రత బంతి మీద ఉందని సడెన్ గా చూస్తే కళ్ల ముందు శివమ్ దూబే ఉన్నాడని తనను ఢీకొడతానేమో అని భయపడ్డానని...అయితే దూబే కదలకుండా నిలబడటంతో క్యాచ్ ను అందుకుని తనకు విసిరి బౌండరీ లైన్ లోకి పడిపోయానని చెప్పాడు అక్షర్. మొత్తం మీద బ్యాటింగ్, బౌలింగ్ లో చెప్పుకోదగ్గ ఫర్ ఫార్మెన్స్ కి అక్షర్ కి ఈసారి స్కోప్ దక్కకపోయినా...ఫీల్డింగ్ లో మాత్రం ఇరగదీస్తూ టీమిండియా దిశగా మ్యాచ్ లు తిప్పేస్తున్నాడు బాపూ. పైగా ఈ వరల్డ్ కప్ లో బాల్ అక్షర్ పటేల్ ఎక్కడున్నాడో వెతుక్కుని మరీ వస్తుందేమో అని ముగిస్తూ ఫన్ క్రియేట్ చేశాడు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
India Tour of Bangladesh: శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget