అన్వేషించండి
Batting Tips : బ్యాట్‌తో బంతిని ఇలా హిట్ చేస్తే సిక్సర్ల మోతే, ఈ చిట్కా హిట్టర్లకు మంచి ట్రిక్
Batting Tips : మీరు క్రికెట్‌లో ఎక్కువసేపు ఆడాలనుకుంటే, ఈ చిట్కాలు పాటించండి. అప్పుడు మీరు స్టైల్‌గా సిక్సర్లు కొట్టవచ్చు.
మీరు క్రికెట్ అభిమానులైతే, ప్రతిసారీ మైదానంలో సిక్సర్లు, ఫోర్లు కొట్టాలని కోరుకుంటే, మీరు బ్యాట్ తిప్పే పవర్ మాత్రమే కాకుండా, సరైన సాంకేతికత, ఫుట్‌వర్క్, టైమింగ్‌ను కూడా కలిగి ఉండాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేదా ఏబీ డివిలియర్స్ వంటి ప్రతి గొప్ప ఆటగాడు తమ టెక్నిక్‌ను నిరంతరం మెరుగుపరుచుకుంటారు. కాబట్టి మీరు కూడా మైదానంలో ఎక్కువసేపు నిలబడాలని, స్టైల్‌గా సిక్సర్లు కొట్టాలని కోరుకుంటే టిప్స్ పాటించాలి.
1/6

మీ ఆట సరిగ్గా ఆడాలంటే మీ బ్యాటింగ్ ప్రారంభం బలంగా ఉండాలి. దీని కోసం, మొదట మీ నిలబడే స్థానాన్ని నిర్ణయించుకోండి, అంటే బ్యాటింగ్ స్టాన్స్. ఇందులో ఓ భుజాన్నే బౌలర్‌కు కనిపించేలా ఉంచాలి. ఆ తర్వాత రెండు కాళ్ళను భుజాలంత స్పెస్‌లో ఉంచి నిలబడండి. ఇప్పుడు మోకాళ్ళు కొద్దిగా వంగాలి, తద్వారా శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. బ్యాట్‌ను కాళ్ళ దగ్గర నేలపై ఉంచండి. మీ చూపు ఎల్లప్పుడూ బౌలర్‌పై ఉండాలి. దీనిని ఆర్థోడాక్స్ స్టాన్స్ అంటారు. ఇది మీకు అన్ని దిశలలో షాట్‌లు ఆడటానికి వీలు కలిగిస్తుంది.
2/6

క్రికెట్‌లో కేవలం బ్యాట్ మాత్రమే ఊపితే సరిపోదు, మొత్తం శరీరం పని చేయాలి. మీరు షాట్ ఆడటానికి వెళ్ళినప్పుడు, శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచండి. దీని కోసం ముందుగా భుజం తరువాత కాలు ముందుకు వేయండి. ఆ తరువాత తల ఎల్లప్పుడూ నిటారుగా ఉండాలి. కళ్ళు బంతిపై ఉండాలి. చేతులు చాలా టైట్‌గా ఉండకూడదు, కేవలం ఈజీగా బ్యాట్ పట్టుకోండి. ఇది మీ షాట్‌ను స్మూత్‌గా శక్తివంతంగా చేస్తుంది.
3/6

బ్యాటింగ్‌లో ఫుట్‌వర్క్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే, సరైన స్థానంలో పాదాలను ఉంచడం ద్వారానే మీరు బంతిని త్వరగా చేరుకుంటారు. అద్భుతమైన షాట్లు ఆడతారు. బంతి ముందుకు వస్తుంటే ముందుకు కదిలి డ్రైవ్ ఆడండి. షార్ట్ బాల్ అయితే వెనుకకు వెళ్లి కట్ లేదా పుల్ షాట్ ఆడండి. పాదాల కదలిక మీకు బ్యాలెన్స్‌ను టైమింగ్‌ను ఇస్తుంది.
4/6

బ్యాక్ లిఫ్ట్ అంటే బ్యాట్‌ను వెనుకకు తీసుకెళ్లే ప్రక్రియ, ఇదే అసలైన పవర్‌కు కారణం. బ్యాట్ సరైన ఎత్తులో, సరైన సమయంలో వెనుకకు వెళ్ళినప్పుడు, ముందుకు స్వింగ్ చేయడంలో అపారమైన పవర్ వస్తుంది. బ్యాక్ లిఫ్ట్‌ను మెరుగుపరచడానికి, బ్యాట్‌ను బలంగా కాకుండా సహజంగా వెనుకకు తీసుకెళ్లండి. అద్దం ముందు నిలబడి సాధన చేయండి, తద్వారా కదలిక సరిగ్గా కనిపిస్తుంది. వేగవంతమైన కదలికలను నివారించండి. స్వింగ్ పూర్తి కావాలి. బ్యాక్ లిఫ్ట్ ఎంత స్పష్టంగా ఉంటే, బ్యాట్ అంత వేగంగా పడుతుంది. బంతి అంత దూరం వెళుతుంది.
5/6

బంతిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైన నియమం. మీరు ఏ స్థాయిలో ఆడుతున్నా, మీ దృష్టి బంతిపై లేకపోతే, షాట్ మిస్ అవ్వడం ఖాయం. బౌలర్ చేతి నుంచి బంతి రాగానే దానిపై దృష్టి పెట్టండి, తల స్థిరంగా ఉంచండి, వంచవద్దు, బంతి పిచ్ అయిన వెంటనే ఏ షాట్ ఆడాలి అని నిర్ణయించుకోండి. డ్రైవ్, డిఫెన్స్ లేదా పుల్ వంటివి.
6/6

ఏ ఆటగాడు ఒక్కసారిగా గొప్పవాడు కాలేడు. అందువల్ల, ప్రతిరోజూ సాధన చేయడం ముఖ్యం. క్లబ్ లేదా కళాశాలలో నెట్ ఉంటే, వారానికి 2 నుంచి 3 రోజులు వెళ్ళండి. నెట్ లేకపోతే, ఇంటి పెరట్లో లేదా గ్యారేజీలో సాధన చేయండి. గోడపై బంతిని కొట్టడం ద్వారా రిఫ్లెక్స్ శిక్షణ చేయండి. మీ షాట్లను రికార్డ్ చేయండి. ఎక్కడ మెరుగుపరచాలో చూడండి. రోజుకు కేవలం 20 నిమిషాల సాధన మీ టైమింగ్, ఫుట్‌వర్క్‌ను అద్భుతంగా మెరుగుపరుస్తుంది.
Published at : 13 Nov 2025 06:15 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















