అన్వేషించండి

RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?

Ram Gopal Varma On Urmila Mantondkar: రామ్ గోపాల్ వర్మ ఊర్మిళ మాంటోండ్కర్ గురించి స్పందించారు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు.

Ram Gopal Varma break silence : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం వార్తల్లో ఉంటారు. ఒకప్పుడు సినిమాలతో సన్షేషన్ క్రియేట్ చేసిన వర్మ..ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టులతో ట్రెండింగ్ లో ఉంటున్నారు.  అయితే RGV సినిమాలు, ఆయన పెట్టే పోస్టులు మాత్రమే కాదు.. ఆయన వ్యక్తిగత జీవితంలో వ్యవహారాలు కూడా వైరల్ అవుతుంటాయ్. అప్పట్లో రంగీలాలో హీరోయిన్ గా నటించిన ఊర్మిళ మటోండ్కర్ తో అఫైర్ ఉందనే ప్రచారం జరిగింది. ప్రతి విషయాన్ని సూటిగా మాట్లాడే వర్మ..ఈ విషయంపై గతంలోనూ పెద్దగా స్పందించలేదు..కానీ రీసెంట్ గా దీనిపై  మాట్లాడారు 
 
ఊర్మిళ -  రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో చాలా సినిమాలొచ్చాయ్. ఆ సినిమాలన్నీ దాదాపు హిట్టయ్యాయ్. వరుసగా ఒకే హీరోయిన్ కి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తుండడంతో ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్ థింగ్ అనే ప్రచారం జరిగింది. రీసెంట్ గా  ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఆ కామెంట్స్ పై రియాక్టయ్యారు వర్మ.  ఏమన్నారంటే...

"ఆమె చాలా ప్రతిభావంతులైన నటి అని నేను భావిస్తున్నాను. అందుకే నేను ఆమెతో చాలా సినిమాల్లో పనిచేశాను. నేను అమితాబ్ బచ్చన్‌తో కూడా ఎక్కువ సినిమాలు చేశాను కానీ దానిగురించి ఎవరూ మాట్లాడరు" ....అని తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన సినిమాలు ఊర్మిళకు వర్సటైల్ యాక్ట్రెస్ గా పేరు సంపాదించిపెట్టాయ్. తన ఆత్మకథ  Guns & Thighs: The Story of My Lifeలో కూడా ఊర్మిళ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు RGV. ఆమె అందం, ప్రతిభ నచ్చి రంగీలా మూవీకోసం సెలెక్ట్ చేశానని చెప్పారు. 1995లో వచ్చిన ఆ మూవీ రీసెంట్ గా 4K రీ రిలీజ్ అయింది. 1997 లో దౌడ్ మూవీ,  1998 లో సత్య, 2001లో ప్యార్ తునే క్యా కియా లో నటించింది. ఆ తర్వాత భూత్, కౌన్ మూవీస్ లోనూ RGV తో కలసి పనిచేసింది. 

ఊర్మిళతో ప్రేమ వ్యవహారం కారణంగానే RGV భార్య రత్నావర్మ మధ్య దూరం పెరిగిందనే వార్తలొచ్చాయి. ఓ మూవీ షూటింగ్ టైమ్ లో RGV భార్య - ఊర్మిళ మధ్య పెద్ద తగాదా జరిగిందనే వార్తలు కూడా వచ్చాయ్. ఇందుకే రత్నా వర్మ విడాకులు తీసుకున్నారని చెబుతారు. ఆ తర్వాత RGV తన పుస్తకంలో ఊర్మిళను పొగుడుతూ రాయడంతో ఈ వార్తలకు మరింత చేకూర్చినట్టైంది. అయితే ఈ రూమర్స్ వల్లనే ఆ తర్వాత ఊర్మిళకు అవకాశాలు తగ్గిపోయాయని..సపోర్టింగ్ రోల్స్ మాత్రమే పలకరించాయని టాక్. 2016లో కశ్మీర్ బిజినెస్ మ్యాన్ మొహ్సిన్ అక్తర్ మీర్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉండిపోయింది. తన రీఎంట్రీ గురించి ఏడాది క్రితం మాట్లాడుతూ.. RGV తో మళ్లీ కలసి వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది ఊర్మిళ. 

అయితే..రీసెంట్ గా జూమ్ టీవీ ఇంటర్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై మొదటిసారిగా స్పందించారు రామ్ గోపాల్ వర్మ. ఆమె వర్సటైల్ యాక్ట్రెస్ అందుకే నాలుగు సినిమాలు చేశాను. అమితాబ్ తో అంతకన్నా ఎక్కువ సినిమాలు చేసినప్పుడు ప్రశ్నించని వారు ఊర్మిళ గురించి ఎందుకు అడుగుతున్నారు..ఇందతా సోషల్ మీడియా, సిస్టమ్ వచ్చిన మిథ్ అంతే అని కొట్టిపడేశారు. అయినా నటీనటుల పనిపై ఫోకస్ చేయాలని పర్సనల్ లైఫ్ కాదన్నారు.  ఇప్పటివరకూ డైరెక్టర్ గా , నిర్మాతగా ఉన్న ఆర్జీవీ షో మ్యాన్ అనే మూవీతో తనలో నటుడిని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Vishwanath And Sons Pre Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు
విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget