Gunde Ninda Gudi Gantalu December 8 Episode: మీనాపై ప్రభావతి నిందలకు బాలు చెప్పే సమాధానం ఏంటి - గుండెనిండా గుడిగంటలు డిసెంబర్ 8 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: బంగారం దొంగతనం చేసి దొరికిపోయాక కూడా ప్రభావతి బుద్ధి చూపిస్తోంది. మీనాకు క్షమాపణలు చెప్పను అని తేచ్చిపడేసింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 08 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 December 08 Episode
నాక్కొంచెం ప్రశాంతత కావాలి గుడికి వెళాదం అని చెప్పి కామాక్షితో కలసి గుడికి వెళ్లిపోతుంది ప్రభావతి. చేతులకు గాజులు వేసుకోవచ్చు కదా అన్న కామాక్షి మాటకు.. నువ్వు కొనివ్వు..చిట్టీ కట్టి డబ్బులు తీర్చేస్తాను అని పంచ్ వేస్తుంది. అమ్మో చేయి నా నెత్తిన పెట్టావా అని ఊరుకుంటుంది ప్రభావతి. మీనాకు క్షమాపణలు చెబితే కానీ అన్నయ్య నీతో మాట్లాడేలా లేరన్న కామాక్షి మాటలకు అంతెత్తున లేస్తుంది. ఆయన మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ ఆ పూలమ్ముకునేదానికి క్షమాపణలు చెప్పను అంటుంది. నేను నిన్ను వదిలినా విధి వదలదు అంటూ అప్పుడే గుడిలో అడుగుపెట్టిన శ్రుతి తల్లిని చూపిస్తుంది కామాక్షి. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోదాం అనుకున్నా కానీ ఆమె మాత్రం దగ్గరకు వచ్చి మరీ పలకరిస్తుంది.
రిటైర్ అయ్యాక ఏం పని ఉంటుంది..మీ వారు ఎందుకు గుడికిరాలేదంటూ సూటి పోటి మాటలంటుంది. శ్రుతి చెప్పడంతో ఇంట్లో ఏం జరిగిందో మొత్తం తెలుసు కాబట్టి.. కావాలనే ప్రభావతి బోడి చేతులు చూసి గాజుల గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తుంది. కామాక్షి కవర్ చేస్తున్నా కానీ శ్రుతి తల్లి మాత్రం తగ్గదు. మేడపైన రూమ్ వేసుకునేందుకు డబ్బుల్లేవన్నారు..నేను చెక్ ఇచ్చినా తీసుకోలేదు..ఆ గాజులు అమ్మేసి రూమ్ కట్టారా ఏంటి అని సెటైర్స్ వేస్తుంది. ఆవిడకు ఎలాగోలా సమాధానం చెప్పేసి తప్పించుకుని ఇంటికి చేరుకుంటారు.
జరిగిన విషయం మొత్తం తలుచుకుని సత్యం బాధపడతాడు. బాలు మీనా ఓదార్చేందుకు ప్రయత్నిస్తారు.. అత్తయ్యతో మాట్లాడండి మావయ్య అని అడుగుతుంది మీనా. మీ అమ్మ చేసిన తప్పుకి..నేను మీకు క్షమాపణ చెబుతున్నా అంటాడు సత్యం. మీ మధ్య ఇంత దూరం పెరుగుతుందని తెలిస్తే ఆ విషయం బయటపెట్టేవాడిని కాదంటాడు బాలు. తప్పుచేసింది వాడే అని తెలిసి కూడా నీ తల్లిపై నా తల్లిపై నింద వేసింది చూడు..అప్పుడే దానిపై నాకు అసహ్యం పుట్టింది అంటాడు సత్యం. ఆ మాటలు వింటూనే ప్రభావతి ఎంట్రీ ఇస్తుంది. కొంచెం మనశ్సాంతి కావాలి..ఈ దుష్టశక్తి ఇక్కడి నుంచి పోతే అది వస్తుంది అంటాడు సత్యం. అలాగే నిల్చుని ఉండిపోతుంది ప్రభావతి. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా అంటూ మరోసారి మీనాపై నిప్పులు చెరుగుతుంది ప్రభావతి. అక్కడి నుంచి వెళ్లిపోతుంది
మరోవైపు సత్యం-ప్రభావతి మధ్య దూరం పెరిగిపోతుందేమో అని బాధపడతారు బాలు-మీనా. ఏమైనా చేసి ఇద్దర్నీ కలపాలని ఆలోచిస్తారు. ఏం చేద్దాం అనుకుంటూ ప్లాన్స్ వేసుకునే పనిలో పడ్డారు. తమ కారణంగా తల్లిదండ్రుల మధ్య పెరిగిన తామే తగ్గించాలని ఫిక్సయ్యారు. అదెలా సాధ్యం అవుతుందో చూడాలి
మర్నాడు ఉదయాన్నే మీనా కిచెన్లో టిఫిన్ తయారుచేస్తుంటుంది. హాల్లోనే సత్యం, బాలు కూర్చోవడంతో అక్కడి నుంచి నేరుగా కిచెన్లోకి వెళుతుంది. ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. పూరీలు చేస్తున్నా అత్తయ్యా మీరు వెళ్లి కూర్చోండి నేను తీసుకొస్తాను అంటుంది. ఎలాగూ మా ఆయనకు చాడీలు చెప్పి లేనిపోని గొడవలు పెట్టావ్..ఇప్పుడు సంతృప్తిగా ఉందా అంటూ నోటికి పనిచెబుతుంది. నీకు నచ్చిందేదో నువ్వు చేసుకుని తిను మాకెవ్వరికీ పెట్టాల్సిన అవసరం లేదంటుంది. ప్రభావతి బాగోతం మొత్తం హాల్లో కూర్చున్న బాలు, సత్యం వింటారు. ప్రభావతి దండకం పూర్తయ్యేసరికి కోపంగా లేచి నిల్చుంటాడు సత్యం.. ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి






















