Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా నేడు మూడవ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచాయి. సిరీస్ 1-1తో సమంగా ఉంది.
ఇక టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ .. గత రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. అయితే ధర్మశాలలో జరిగే మూడో మ్యాచ్‌లో ఎలాగైనా రన్స్ స్కోరు చేయాలని ఆశిస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. అది ఏంటంటే టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 2016లో సూపర్‌ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ .. ఐపీఎల్ సహా మొత్తం 31 టీ20 మ్యాచ్‌లలో 1,614 రన్స్ చేశాడు.
మరోవైపు అభిషేక్ శర్మ ఈ ఏడాది ఇప్పటివరకు 39 టీ20 మ్యాచ్‌లు ఆడి 1,533 రన్స్ స్కోరు చేశాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ మరో 81 పరుగులు చేస్తే.. విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేస్తాడు.





















