టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ 131 కోట్ల రూపాయల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మొత్తం ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, సెలెక్టర్లు, సహాయక సిబ్బంది అందరికీ కలిపి ఇవ్వబడుతుంది.
BCCI Announces Reward: భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
BCCI Announces Reward: క్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డు ఇప్పుడే మరింత ఉదారంగా మారింది! T20 ప్రపంచ కప్ 2026 విజేతలకు BCCI రికార్డు స్థాయిలో ₹131 కోట్ల బహుమతిని ప్రకటించింది.

- టీ 20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ బహుమతి.
- ఆటగాళ్లు, కోచ్‌లకు 131 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు.
- ఫైనల్‌లో 255/5 స్కోరు, 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.
- సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్.
BCCI Announces Reward for T20 World Cup Champions: భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా రెండోసారి టీ 20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడమే కాకుండా తన టైటిల్‌ను విజయవంతంగా కాపాడుతున్న మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి, మూడోసారి పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) జట్టుకు కళ్లు చెదరే బహుమతిని ప్రకటించింది.
131 కోట్ల భారీ నగదు బహుమతి
భారత జట్టు సాధించిన ఈ అసాధారణ విజయానికి గుర్తింపుగా బీసీసీఐ ఏకంగా 131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ భారీ మొత్తం కేవలం ఆటగాళ్లకే కాకుండా కోచింగ్ స్టాఫ్, సెలెక్టర్లు, సహాయక సిబ్బంది అందరికీ కలిపి అందించనున్నారు. 2024లో బార్బడోస్ వేదికగా సాధించిన విజయం తర్వాత ప్రకటించిన 125కోట్ల బహుమతి కంటే ఇది అధికం.
ఫైనల్‌లో భారత్ జైత్రయాత్ర
నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో భారత్ అన్ని విభాగాల్లో రాణించింది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగులు భారీ స్కోరును సాధించింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో కివీస్ దశలోనూ భారత్ బౌలర్లకు పోటీ ఇవ్వలేకపోయింది. చివరకి 96 పరుగుల భారీ తేడాతో భారత్ విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో సొంత గడ్డపై టీ 20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతోపాటు టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
విజయ సారథులు సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా
ఈ మెగా టోర్నీలో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో సంజూ శాంసన్ ఒకరు. టోర్నీ ఆద్యంతం అద్భుతం ఫామ్‌ను కనబరిచిన సంజూ, మొత్తం 321 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. ముఖ్యంగా ఫైనల్‌లో చేసిన 89 పరుగులు భారత్ భారీ స్కోరు సాధించడానికి పునాది వేశాయి.
మరోవైపు బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో న్యూజిలాండ్ బ్యాటర్లను వణికించాడు. ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక వికెట్లు పడగొట్టిన తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీనికి బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది.
ఐసీసీ- బీసీసీఐ నుంచి భారీ ఆదాయం
బీసీసీఐ ప్రకటించిన 131 కోట్ల రివార్డుతోపాటు, ఐసీసీ నుంచి కూడా భారత జట్టుకు భారీగా ప్రైజ్ మనీ దక్కింది. ఫైన్ విజేతగా నిలిచినందుకు భారత్‌కు సుమారు 2.34 మిలియన్ డాలర్లు అంటే 21.5 కోట్లు లభించాయి. రన్నర్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 10.75 కోట్లు దక్కాయి.
Frequently Asked Questions
టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ ఎంత బహుమతి ప్రకటించింది?
ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ మరియు బౌలింగ్‌లో ఎలా రాణించింది?
ఫైనల్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 96 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మరియు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఎవరికి దక్కాయి?
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సంజూ శాంసన్‌కు దక్కింది, అతను 321 పరుగులు చేశాడు. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టుకు ఐసీసీ నుంచి ఎంత ప్రైజ్ మనీ వచ్చింది?
టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచినందుకు భారత జట్టుకు ఐసీసీ నుంచి సుమారు 2.34 మిలియన్ డాలర్లు, అంటే 21.5 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా లభించింది.
ట్రెండింగ్ వార్తలు



















