తెలంగాణ ప్రభుత్వం వెలుగుమట్ల ప్రాంత నిరాశ్రయులకు ఇందిరమ్మ ఇళ్లు మరియు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని నిర్ణయించింది.
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Velugumatla Issue: తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన వెలుగుమట్ల బాధితుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. బుధవారం వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు.

- ఖమ్మం వెలుగుమట్ల నిరాశ్రయులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.
- నిరాశ్రయుల కోసం ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించింది.
- 412 మంది అర్హులకు ఇంటి స్థలాలతో పాటు ఇళ్ల మంజూరు.
- బుధవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది.
Velugumatla Issue: సుదీర్ఘ కాలంగా నివాసం కోసం ఎదురు చూస్తున్న ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంత నిరాశ్రయుల నిరీక్షణకు తెరపడింది. తమకంటూ ఒక సొంత గూడు ఉండాలని కలలు కంటున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి పట్టాల మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
సమగ్ర సర్వేతో అర్హుల గుర్తింపు
ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో గత వారం రోజులుగా క్షేత్రస్థాయిలో అత్యంత పారదర్శకంగా సర్వే నిర్వహించారు. ముఖ్యంగా భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని, సరైన పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించడంపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సర్వేలో ప్రతి ఇంటినీ సందర్శించి, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని అర్హులను ఎంపిక చేశారు.
మొత్తం 766 మంది బాధితులను ప్రాథమికంగా పరిశీలించగా, నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో అర్హత కలిగిన 412 మందిని తుది జాబితాలో చేర్చారు. ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తూ, రాజకీయ ప్రమేయం లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేసినట్టు సమాచారం.
లబ్ధిదారుల వర్గీకరణ, పంపిణీ వివరాలు
ప్రభుత్వం గుర్తించిన 412 మంది అర్హులకు రెండు రకాల లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. మొత్తం 311 మంది బాధితులకు ఇంటి స్థలంతోపాటు , ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన పత్రాలను ప్రభుత్వం అందజేయనుంది. అప్పటికే నివాసం ఉండి, కేవలం పక్కా గృహం అవసరమైన మరో 101 మందికి ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేయనున్నారు.
ఈ ప్రక్రియలో భాగంగా రెవెన్యూ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి, అర్హులైన లబ్ధిదారులను పిలిచి వారికి టోకెన్లు పంపిణీ ప్రారంభించారు. పంపిణీ సమయంలో ఎటువంటి గందరగోళం లేకుండా ఈ టోకెన్లు జారీ చేశారు.
బుధవారం పట్టాల పంపిణీ
ఈ కార్యక్రమానికి సంబంధించి పట్టాల పంపిణీ కార్యక్రమం బుధవారం జరగనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Frequently Asked Questions
వెలుగుమట్ల నిరాశ్రయులకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందిస్తోంది?
ఇంటి పట్టాల కోసం అర్హులుగా ఎంతమందిని గుర్తించారు?
మొత్తం 766 మందిని ప్రాథమికంగా పరిశీలించగా, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన 412 మందిని తుది జాబితాలో చేర్చారు.
412 మంది అర్హులకు ఏయే రకాల లబ్ధి చేకూరుతుంది?
311 మందికి ఇంటి స్థలంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి అవసరమైన పత్రాలు, మిగిలిన 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు.
పట్టాల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది?
పట్టాల పంపిణీ కార్యక్రమం బుధవారం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు జిల్లా మంత్రులు పాల్గొంటారు.
ట్రెండింగ్ వార్తలు






















