అన్వేషించండి

Sanju Samson and Sachin Tendulkar: సంజూ శామ్సన్ విశ్వరూపం వెనుక ఆ 25 నిమిషాల ఫోన్ కాల్! సచిన్ చెప్పిన మంత్రం ఏంటీ?

Sanju Samson and Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడిన తర్వాత T20 ప్రపంచ కప్‌లో కీలకమైన మ్యాచ్‌లలో రాణించానని సంజూ చెప్పాడు. ఇంతకీ 25 నిమిషాల ఫోన్ కాల్‌లో ఏం మాట్లాడుకున్నారో చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సంజూ శాంసన్ తన విజయ రహస్యం సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడటమని చెప్పాడు.
  • ఒత్తిడిలో ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఇచ్చిన 25 నిమిషాల ఫోన్ కాల్ మార్పు తెచ్చింది.
  • సచిన్ సలహాతో ప్రశాంతంగా, లెక్కలతో కూడిన బ్యాటింగ్ తో ఆట తీరు మార్చుకున్నాడు.
  • ప్రపంచకప్ సమయంలో నెల రోజుల పాటు డిజిటల్ డిటాక్స్ పాటించి ఆటపై దృష్టి పెట్టాడు.

Sanju Samson and Sachin Tendulkar: టీ20 ప్రపంచకప్‌లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత దేశమంతా ఒకే పేరు మారుమోగుతోంది. అదే సంజూ శాంసన్. టోర్నీ ఆద్యంతం అద్బుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఈ కేరళ స్టార్, తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. కేవలం బ్యాటింగ్ టెక్నిక్ మాత్రమే కాకుండా, మానసిక దృఢత్వం తనను ఎలా విశ్వవిజేతగా నిలబెట్టిందో వివరించాడు. క్రికెట్ గాడ్‌, మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడిన ఫోన్ కాల్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అన్నాడు. 

పాతాళం నుంచి శిఖరానికి

కొన్ని రోజుల క్రితం వరకు సంజూ శాంసన్ ఓ ఫెయిల్యూర్‌ క్రికెటర్. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సమయంలో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆ సమయంలో మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నాడు. ఇదే విషయాన్ని సంజూ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత చెప్పాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనే మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌ ఆయనకు అండగా నిలిచాడు. సచిన్‌తో జరిగిన సుదీర్ఘ చర్చలు సంజూ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. 

కెరీర్‌ను మలుపు తిప్పిన 25 నిమిషాల ఫోన్ కాల్ 

సచిన్ టెండూల్కర్‌తో సంజూకు గతంలోనూ పరిచయం ఉన్నప్పటికీ, ఈసారి జరిగిన చర్చలు చాలా ప్రత్యేకం. తన కెరీర్‌లో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను, వైఫల్యాలను అధిగమించిన తీరు సచిన్‌ సంజూతో పంచుకున్నారు. సుమారు 25 నిమిషాల పాటు సాగిన ఆ ఫోన్ కాల్, సంజూలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. కేవలం మానసిక స్థయిర్యాన్నే కాకుండా మైదానంలో ప్రశాంతంగా ఎలా ఉండాలో సచిన్‌ ఒక స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ను అందించారు. ఫైనల్‌మ్యాచ్‌కు ఒక రోజు ముందు కూడా సచిన్‌ సంజూకు ఫోన్ చేసి అన్నీ సిద్ధమేనా అని ఆత్మీయంగా పలకరించడం ఆయనకు కొండత బలాన్ని ఇచ్చింది. 

ఆట తీరులో మార్పు 

సచిన్ మార్గదర్శకత్వంలో సంజూ తన బ్యాటింగ్ శైలిని మార్చుకున్నాడు. గతంలో ప్రతి బంతిని బాదాలనే తపనతో వికెట్ పారేసుకునే సంజూ, ఇప్పుడు అత్యంత ప్రశాంతంగా, లెక్కలతో కూడిన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ పోరులో అతను ఆడిన 89 పరుగుల ఇన్నింగ్స్‌ఒక మాస్టర్ క్లాస్‌గా నిలిచింది. క్రీజులో వచ్చిన క్షణం నుంచి ఆటపై పూర్తి నియంత్రణ సాధించి, భారత్‌ మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 

డిజిటల్ డిటాక్స్‌- ఫోన్ స్విచ్ఛాఫ్‌

ఆధునిక కాలంలో క్రీడాకారులపై సోషల్ మీడియా ప్రభావం పెను సవాలుగా మారింది. విమర్శలు, ప్రశంసల మధ్య ఏకాగ్రత కోల్పోకుండా ఉండేందుకు సంజూ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచకప్ జరిగిన నెల రోజుల పాటు తన మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉన్నాడు. బయటి ప్రపంచంలో జరిగే గోల మన ఏకాగ్రతను దెబ్బ తీస్తుంది. అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉండి, కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టాను అని సంజూ తెలిపారు. ఆయన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఒక ప్రత్యేక బృందం పర్యవేక్షించగా సంజూ మాత్రం పూర్తి స్థాయిలో ఆటకే అంకితమయ్యారు. 

ఈ విజయం కేవలం సంజూ శామసన్‌ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఓర్పు, క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం ఉంటే ఎంతటి వైఫల్యాన్నైనా అధిగమించవచ్చని నిరూపించిన స్ఫూర్తిదాయక కథనం. 

Frequently Asked Questions

టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ శాంసన్‌ తన విజయ రహస్యం ఏమిటని చెప్పాడు?

తన విజయ రహస్యం కేవలం బ్యాటింగ్ టెక్నిక్ మాత్రమే కాదని, మానసిక దృఢత్వం కూడా ముఖ్యమని సంజూ చెప్పాడు. సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడిన ఫోన్ కాల్ తన జీవితాన్ని మార్చిందని అన్నాడు.

సంజూ శాంసన్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సంఘటన ఏమిటి?

కెరీర్‌లో వైఫల్యాలతో నిరాశలో ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్‌తో సుమారు 25 నిమిషాల పాటు జరిగిన ఫోన్ కాల్ సంజూ ఆలోచన విధానాన్ని మార్చి, కొత్త ఉత్తేజాన్ని నింపింది.

సచిన్ టెండూల్కర్‌ సంజూ శాంసన్‌కు ఎలా మార్గనిర్దేశం చేశారు?

సచిన్‌ తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలను, వైఫల్యాలను అధిగమించిన తీరును సంజూతో పంచుకున్నారు. మైదానంలో ప్రశాంతంగా ఎలా ఉండాలో ఒక స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ను అందించారు.

సంజూ శాంసన్‌ తన ఆట తీరును ఎలా మార్చుకున్నారు?

సచిన్‌ మార్గదర్శకత్వంలో, ప్రతి బంతిని బాదాలనే తపనతో కాకుండా, ప్రశాంతంగా, లెక్కలతో కూడిన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. ఫైనల్‌లో 89 పరుగుల ఇన్నింగ్స్‌తో కీలక పాత్ర పోషించాడు.

ప్రపంచకప్ సమయంలో సంజూ శాంసన్‌ సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నారు?

ఆధునిక కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల ఏకాగ్రత కోల్పోకుండా ఉండేందుకు, బయటి ప్రపంచపు గోల ఆటపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఆయన ఒక నెల పాటు ఫోన్‌కు దూరంగా ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget