సుప్రభాతం, తోమాల వంటి డిజిటల్ లక్కీ డిప్ సేవలకు ఆగస్టు 18న ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందినవారు ఆగస్టు 20 నుండి 22న మధ్యాహ్నం 12 గంటల లోపు ఛార్జీలు చెల్లించాలి.
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Tirumala News | నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్ తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.

- నవంబర్ లక్కీ డిప్ సేవల నమోదు ఆగస్టు 18-20 వరకు.
- సాధారణ, వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు ఆగస్టు 21న విడుదల.
- అంగప్రదక్షిణ, శ్రీవాణి టిక్కెట్లు ఆగస్టు 24న టీటీడీ జారీ.
- రూ.300 ప్రత్యేక దర్శన, గదుల కోటా ఆగస్టు 25న అందుబాటు.
TTD Darshan Quota Schedule | తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ కీలక అప్టేడ్ ఇచ్చింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల సౌకర్యార్థం నవంబర్ నెలకు సంబంధించిన దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఇందులో భాగంగా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి డిజిటల్ లక్కీ డిప్ సేవలకు సంబంధించి ఆగస్టు 18న ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఆగస్టు 20 నుండి 22న మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ణీత ఛార్జీలు చెల్లించి తమ టికెట్లను కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం వంటి సాధారణ ఆర్జిత సేవా టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు భక్తులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు విడుదల చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి కోసం కేటాయించే ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఆగస్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
అత్యంత ఆదరణ పొందిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. దాంతో పాటు తిరుమల, తిరుపతిలలో భక్తుల బస కోసం గదుల కోటాను ఆగస్టు 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. శ్రీవారి దర్శనం, సేవలు, గదుల బుకింగ్ కోసం భక్తులు కేవలం అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే భక్తులు ముందస్తు నమోదు చేసుకోవాలని టీటీడీ ప్రజాసంబంధాల అధికారి విజ్ఞప్తి చేశారు.
Frequently Asked Questions
నవంబర్ నెలకు సంబంధించిన లక్కీ డిప్ సేవలకు ఎప్పుడు నమోదు చేసుకోవాలి?
శ్రీవారి కల్యాణోత్సవం వంటి సాధారణ ఆర్జిత సేవా టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు?
శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి సాధారణ ఆర్జిత సేవా టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి.
రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదుల కోటా ఎప్పుడు విడుదల అవుతాయి?
అత్యంత ఆదరణ పొందిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
వయోవృద్ధులు, దివ్యాంగుల ఉచిత దర్శన టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు?
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను ఆగస్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు ఆగస్టు 24న ఉదయం 11 గంటలకు విడుదల అవుతాయి.
ట్రెండింగ్ వార్తలు























