అన్వేషించండి

ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc

Ather Konarc: ఏథర్ ఎనర్జీ మొత్తం 6 వేరియంట్లలో ఏథర్ కోణార్క్ తీసుకురానుంది. SR1, SR2, SR3, SR4 ఉంటాయని భావిస్తున్నారు. గరిష్టంగా 200 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అథర్ కోనార్క్ ఆగస్టు 29న, తక్కువ ధరలో విడుదల కానుంది.
  • ఆరు వేరియంట్లలో 200 కి.మీల రేంజ్, బిల్ట్-ఇన్ ఛార్జర్.
  • నగర ప్రయాణాలకు సౌకర్యం, వార్షిక సర్వీసింగ్, Airwalk ఫీచర్.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్న వారి కోసం Ather Energy త్వరలోనే ఒక నూతన మోడల్‌ను తీసుకురాబోతోంది. ఇది కంపెనీ ప్రస్తుత స్కూటర్లతో పోలిస్తే మరింత అందుబాటు ధరలో ఉంటుంది. కంపెనీ కొత్త Ather Konarc 29 ఆగస్టున Ather Annual Community Day సందర్భంగా లాంచ్ చేయనున్నారు. దీనిని కంపెనీకి చెందిన 450 సిరీస్, ఫ్యామిలీ స్కూటర్ Rizta కంటే తక్కువ ధర కలిగిన మోడల్‌గా అందుబాటులోకి తేనున్నారు. లాంచ్‌కు ముందే దీని బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్, సర్వీస్‌కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.

ఈ స్కూటర్ ఎన్ని వేరియంట్లలో రానుంది

Ather Konarcను కంపెనీ ప్రస్తుతం Ather 450 సిరీస్ ప్రధానంగా స్పోర్టీ, ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లకు పేరుగాంచగా, Riztaను ఫ్యామిలీ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. Konarc ద్వారా ఎక్కువ బడ్జెట్ ఉన్న వినియోగదారులను చేరుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. దీనిని Ather నూతన EL ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించనున్నారు.

లీకైన వివరాల ప్రకారం, Ather Konarcను మొత్తం 6 వేరియంట్లలో తీసుకురావచ్చు. వీటిలో 4 వేరియంట్లు SR1, SR2, SR3, SR4 కాగా, ఎక్కువ ఫీచర్లు ఉండే రెండు వేరియంట్లు QR2, QR3 కావచ్చు. దీనివల్ల Konarc మోడల్ TVS iQube, Bajaj Chetakతో పాటు Hero Vida VX2 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది

Also Read: రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి

200 KM వరకు రేంజ్ 

Ather Konarc అతిపెద్ద ప్రత్యేకత దాని రేంజ్. ఇందులో కంపెనీ కొత్త Bedrock బ్యాటరీని అందించనుంది. వేర్వేరు వేరియంట్లలో వేర్వేరు బ్యాటరీ లేదా రేంజ్ ఆప్షన్లు లభించవచ్చు. లీకైన సమాచారం ప్రకారం Konarc మోడల్ 100KM, 125KM, 160KM, 200KM వరకు క్లెయిమ్ చేసిన రేంజ్ ఆప్షన్లలో అందుబాటులోకి రావచ్చు. నగరంలో తక్కువ దూరం ప్రయాణించే వారికి, ఎక్కువ ప్రయాణం చేసే వారు సుదీర్ఘ రేంజ్ మోడల్‌ను ఎంచుకోవచ్చు.

ఇక్కడ 200KM అనేది క్లెయిమ్ చేసిన రేంజ్ అని గ్రహించాలి. వాస్తవ పరిస్థితులలో డ్రైవింగ్ శైలి, వేగం, ట్రాఫిక్, రోడ్డు పరిస్థితి, బరువు , వాతావరణం వంటి పలు అంశాల వల్ల రియల్ రేంజ్ కాస్త తగ్గవచ్చు. ప్రస్తుతం బ్యాటరీ కెపాసిటీ వివరాలు బయటకు రాలేదు. Ather కొత్త EL ప్లాట్‌ఫారమ్ 2kWh నుండి 5kWh వరకు బ్యాటరీలకు సపోర్ట్ చేయగలదు.

ఛార్జింగ్ కూడా సులభం

Konarcలో ఛార్జింగ్‌ను ఈజీ చేయడానికి 450W బిల్ట్-ఇన్ ఛార్జర్‌ను అందించనున్నారు. స్కూటర్‌ను ఇంటి సాకెట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు, ప్రత్యేకంగా ఎక్స్‌టర్నల్ ఛార్జర్‌ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. మరొక 450W ఛార్జర్ ఆప్షన్ కూడా లభించవచ్చు. రెండింటినీ కలిపి ఉపయోగించినప్పుడు మొత్తం ఛార్జింగ్ కెపాసిటీ 900W వరకు చేరుతుంది. ఈ స్కూటర్ 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల సమయం పట్టవచ్చు. అయితే రియల్ ఛార్జింగ్ సమయం బ్యాటరీ వేరియంట్, ఛార్జర్, ఉష్ణోగ్రత ఆధారంగా మారవచ్చు.

Ather Konarcలో కంపెనీ తన ప్రస్తుత స్కూటర్ల కంటే విభిన్నంగా ట్యూన్ చేసిన మోటార్‌ రావొచ్చు. రిపోర్టుల ప్రకారం దీని మోటార్ మరింత నిశ్శబ్దంగా పనిచేసేలా రూపొందించారు. వేగవంతమైన యాక్సిలరేషన్ కంటే రోజువారీ నగర ప్రయాణాలకు స్మూత్, సౌకర్యవంతమైన రైడింగ్ అందించడమే దీని లక్ష్యం. దీనివల్ల ఫ్యామిలీ, రోజూ ప్రయాణించే వినియోగదారులకు ఈ స్కూటర్ చాలా హెల్ప్ అవుతుంది. 

ఇందులో Airwalk ఫీచర్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫీచర్ స్కూటర్‌ను మ్యాన్యువల్‌గా ముందుకు, వెనుకకు జరపడానికి సహాయపడుతుంది. బరువైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పార్కింగ్‌లో జరపడానికి లేదా ఇరుకైన చోట బయటకు తీయడానికి ఈ ఫీచర్ ఎంతో అవసరం.

Also Read: E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు

ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్?

Ather Konarc స్కూటర్‌ను 10,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత లేదా ఏడాదికి ఒకసారి (ఏది ముందయితే అది) సర్వీస్ చేయించాల్సి రావచ్చు. Konarc అనేది Ather మాస్-మార్కెట్ వ్యూహంలో అత్యంత కీలకమైన మోడల్. కంపెనీ ఇప్పటివరకు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో గురింపు తెచ్చుకుంది. Konarc ద్వారా Ather బ్రాండ్, టెక్నాలజీని కోరుకుంటూ, 450 సిరీస్ లేదా Riztaపై ఎక్కువ ఖర్చు చేయకూడదనుకునే కస్టమర్లను ఆకట్టుకోనుంది. 

Frequently Asked Questions

Ather Konarc ఎప్పుడు విడుదల కానుంది?

Ather Konarc ఆగస్టు 29న Ather Annual Community Day సందర్భంగా లాంచ్ అవుతుంది. ఇది కంపెనీ స్కూటర్లన్నింటిలోకీ మరింత అందుబాటు ధరలో ఉంటుంది.

Ather Konarc ప్రధాన లక్ష్యం ఏమిటి?

Ather Konarcను 450 సిరీస్, Rizta కంటే తక్కువ ధర కలిగిన మోడల్‌గా తీసుకురానున్నారు. తక్కువ బడ్జెట్‌లో Ather బ్రాండ్, టెక్నాలజీని కోరుకునే వినియోగదారులను ఇది ఆకట్టుకుంటుంది.

Ather Konarc ఎంత రేంజ్ అందిస్తుంది?

Konarc మోడల్ 100KM, 125KM, 160KM, 200KM వరకు క్లెయిమ్ చేసిన రేంజ్ ఆప్షన్లలో అందుబాటులోకి రావచ్చు. ఇందులో కొత్త బెడ్‌రాక్ బ్యాటరీని అందిస్తారు.

Ather Konarc ఛార్జింగ్ ఫీచర్లు ఏమిటి?

Konarc 450W బిల్ట్-ఇన్ ఛార్జర్‌తో వస్తుంది, ఇంటి సాకెట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. ఇది 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటలు పట్టవచ్చు.

Ather Konarcను ఎంత తరచుగా సర్వీస్ చేయించాలి?

Ather Konarcను 10,000 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత లేదా ఏడాదికి ఒకసారి (ఏది ముందైతే అది) సర్వీస్ చేయించాలి. ఇది నిర్వహణను సులభతరం చేస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget