హైదరాబాద్లోని చారిత్రాత్మక చార్మినార్ సమీపంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద మంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.