అన్వేషించండి

Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!

Delimitation Bill Special Majority: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లు పాస్ అవ్వాలంటే స్పెషల్ మెజారిటీ కావాలి. అసలు ఈ ఓటింగ్ జరిగే విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా 50% పెంపు ప్రతిపాదన.

 Delimitation Bill Special Majority: దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు ‘డీలిమిటేషన్ బిల్లు 2026’కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచడంతో పాటు, 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.  అయితే, ఈ మార్పులన్నీ అమలు కావాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడం తప్పనిసరి. సాధారణ బిల్లుల మాదిరిగా దీనిని వాయిస్ ఓటు   ద్వారా ఆమోదించే అవకాశం లేదు. ఈ బిల్లు ఆమోదం అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది.

రాజ్యాంగ సవరణకు స్పెషల్ మెజారిటీ 

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెంచాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే రెండు కీలక షరతులు ఉన్నాయి. సభలోని మొత్తం సభ్యులలో సాధారణ మెజారిటీ (50% కంటే ఎక్కువ) మద్దతు ఉండాలి. సభకు హాజరై ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల (2/3) మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. ఈ రెండు నిబంధనలను లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ విడివిడిగా పాటించాలి.  

వాయిస్ ఓటు ఎందుకు సరిపోదు?

సాధారణ బిల్లుల విషయంలో ఎంపీలు తమ మద్దతును లేదా వ్యతిరేకతను  అవును లేదా కాదు అని మూజువాణి ఓటు పద్ధతిని అనుసరిస్తారు. ఇందులో ప్రతి ఎంపీ ఓటును విడివిడిగా లెక్కించరు. కానీ, రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో సభకు హాజరైన వారిలో కచ్చితంగా 2/3 వంతు మెజారిటీ లభించిందని అధికారికంగా నిరూపించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 368లో వాయిస్ ఓటును నేరుగా నిషేధించనప్పటికీ, లోక్‌సభ రూల్ 158 ప్రకారం ప్రత్యేక మెజారిటీ అవసరమయ్యే ప్రతిపాదనలపై తప్పనిసరిగా డివిజన్ ఆఫ్ ఓట్స్  నిర్వహించాలి. అంటే, ఎలక్ట్రానిక్ విధానం లేదా స్లిప్పుల ద్వారా ప్రతి ఎంపీ ఓటును విడివిడిగా లెక్కించి రికార్డు చేయాలి. అందువల్లే ఈ బిల్లును వాయిస్ ఓటుతో పాస్ చేయడం సాధ్యం కాదు.

Also Read: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ

ఏప్రిల్‌లో వీగిపోయిన బిల్లు  

స్పెషల్ మెజారిటీ రూల్ కారణంగానే ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందలేకపోయింది. ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్లు గట్టెక్కాలంటే మూడింట రెండొంతుల లెక్కన 352 ఓట్లు అవసరం కాగా, ప్రభుత్వానికి అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. 230 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది.  

దక్షిణాది రాష్ట్రాల వాదన 

జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగితే, జనాభా నియంత్రణను అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళన మొదటి నుంచీ ఉంది. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు భారీగా పెరిగి, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందన్న భయంతో విపక్షాలు గతంలో ఈ బిల్లును అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలోనే, అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచేలా సవరణలు చేస్తూ కేంద్రం ఇప్పుడు మరోసారి పార్లమెంటులో బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైంది.

Also Read: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా

Frequently Asked Questions

దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఏమిటి, ప్రస్తుత ప్రతిపాదన దానిని ఎలా పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది?

జనాభా ఆధారంగా సీట్లు పెరిగితే, జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచేలా కేంద్రం ఇప్పుడు సవరణలు చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

అన్నమాచార్య కీర్తనకు అంతర్జాతీయ ఖ్యాతి: విదేశీయుల గొంతులో 'బ్రహ్మమొక్కటే' గూస్ బంప్స్!
అన్నమాచార్య కీర్తనకు అంతర్జాతీయ ఖ్యాతి: విదేశీయుల గొంతులో 'బ్రహ్మమొక్కటే' గూస్ బంప్స్!
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
Anant Ambani: బృందావన్ వెళ్లి గోవర్ధన గిరి ప్రదక్షిణ చేసిన అనంత్ అంబానీ.. తాతయ్య, అమ్మమ్మలే ఆశీస్సులే కారణమని వెల్లడి
బృందావన్ వెళ్లి గోవర్ధన గిరి ప్రదక్షిణ చేసిన అనంత్ అంబానీ.. తాతయ్య, అమ్మమ్మలే ఆశీస్సులే కారణమని వెల్లడి
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget