iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!

iPhone Crimes India: ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం మాట్లాడే టూల్ మాత్రమేగానే ఉండి. టెక్నాలజీ మారుతున్న కొద్దీ దాని పరిధి దాటిపోతోంది. ఫోన్‌లు స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న వేళ కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ ఉండటం గొప్పగా భావిస్తున్నారు జనాలు. ముఖ్యంగా యువత ఈ విషయంలో చాలా వైల్డ్‌గా మారిపోతున్నారు. మహారాష్ట్రలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ.
ఆపిల్ బ్రాండ్ లోకో తమ చేతిలో ఉంటే సమాజంలో విలువ పెరుగుతుందనే ఒక రకమైన ఫోమోలో నేటి తరం కొట్టుమిట్టాడుతోంది. ఈ ఆపిల్ క్రేజ్ వెనుక ఉన్న నిజాలు నేటి సామాజిక ఆలోచనా సరళి ఏ రకంగా పతనమవుతుందో స్పష్టం చేస్తున్నాయి..
మహారాష్ట్రంలో 19 ఏళ్ల కుర్రాడు తనకు ఆపిల్ ఫోన్ కొనివ్వలేదని కొంండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడగా, అతడిని కాపాడేందుకు వెళ్లి తండ్రి, ఆ దారుణ దృశ్యాన్ని చూసి తల్లడిల్లిన తల్లి, ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కొండపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ మధ్య కాలంలో ఉత్తర్‌ప్రదశ్‌లోని లక్నోలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌తో ఐఫోన్ ఆర్దడ్ చేసి, చివరకు దానికి డబ్బులు కట్టలేక అమాయక ఈ కామ్స్ డెలివరీ ఏజెంట్‌ను అత్యంత దారుణంగా హత్య చేసి గోనెసంచిలో కట్టి కాలువలో పారేసిన ఘటన దేశాన్ని షేక్ చేసింది.
ఆపిల్‌ది క్రేజా? మానసిక రోగమా?
ఈ రోజుల్లో పదివేలు సాధారణ ఫోన్‌తో జరిగే పనులే లక్షన్నర విలువైన ఐఫోన్‌తో కూడా జరుగుతున్నాయి. కానీ టీనేజర్లు, జెన్‌జీ యువతలో ఐఫోన్ లేకపోతే ఫ్రెండ్స్ తక్కువగా చూస్తారనే మెంటర్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది.
సోషల్ మీడియోలో యాపిల్ లోగోతో కనిపిస్తే ఎక్కువ లైక్స్ వస్తాయని వాలిడేన్ సిండ్రోమ్ బాగా ఏర్పడింది. ఈ లోగో తమను ఉన్నత వర్గాల ప్రతినిధులుగా చూపుతందని భ్రమలో బతుకుతున్నారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితితో ఏ మాత్రం సంబంధం లేకుండా, సమాజంలో కేవలం గొప్పా కనిపించడం కోసం ప్రాణాలైన తీయడానికి లేదా తీసుకోవడానికి నేటి తరం వెనుకాడటం లేదు. కృత్రిమ ప్రతిష్ట కోసం జరుగుతున్న ఆరాటం నేడు ఒక సామాజిక వ్యాధిగా మారుతోంది.
హత్యలు చేసి కొందరు జీవితాలు నాశనం చేసుకుంటే మరికొందరు అప్పులు చేసి మరీ ఐఫోన్ కొని రోడ్డు పడుతున్నారు. నేడు అందుబాటులోకి వచ్చిన డిజిటల్ ఫైనాన్స్, లోన్ వ్యవస్థలు యువతను సులభంగా ఆకర్షిస్తున్నాయి. ఫిన్టెక్ యాప్‌లు, బై నౌ పే లేటర్, నో కాస్ట ఈఎంఐ ఆఫర్లు యువతను తెలియకుండానే అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి.
నెలకు పదివేల ఆదాయం లేని యువత కూడా క్రెడిట్ కార్డు, EMIల ద్వారా ఐఫోన్‌లు కొనుగోలు చేస్తున్నారు. క్రెడిట్ కార్డు బిల్లులు, ఫైనాన్స్ కంపెనీల రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక ఎన్నో సామాన్య కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పరువు పోతుందనే ఆందోళనతో కన్నవారు అప్పులు తీర్చడానికి తమ సర్వస్వాన్ని కోల్పోతున్నారు.
స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం సమాచారం మార్పిడికి ఉపయోగపడే ఒక కమ్యూనికేషన్ టూల్. అది మీ జీవితం లేదా ఆత్మ గౌరవానికి ఏ మాత్రం కొలమానం కానే కాదు. భౌతిక సుఖాల కోసం కన్నవారిని వేధించడం, డబ్బుల కోసం నేరాలు పాల్పడటం బంగారు భవిష్యత్‌ను శాశ్వతంగా అంధకారంలోకి నెట్టినట్టే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















