Crypto Regulation: క్రిప్టో కరెన్సీ.. సమగ్ర అధ్యయనం తర్వాతే భారత్ నిర్ణయం!

Crypto Regulation: క్రిప్టో కరెన్సీ.. సమగ్ర అధ్యయనం తర్వాతే భారత్ నిర్ణయం!

India China Border: ఇప్పుడు 1962 కాదు చైనా, గుర్తు పెట్టుకో- ఇది నయా భారత్ తట్టుకోలేవు!

India China Border: ఇప్పుడు 1962 కాదు చైనా, గుర్తు పెట్టుకో- ఇది నయా భారత్ తట్టుకోలేవు!

ఇండియా@2047 టైమ్‌లైన్

  • స్వాతంత్య్ర దినోత్సవం

    బ్రిటన్ నుంచి భారతదేశం స్వాతంత్య్రం సాధించింది. తర్వాత అఖండ భారతావని భారత్, పాకిస్థాన్ పేర్లతో రెండు దేశాలుగా విడిపోయింది

    1947
    1
  • మొదటి కశ్మీర్ యుద్ధం

    కశ్మీర్‌లోని వివాదాస్పద హిమాలయ ప్రాంతంలో భారత్, పాకిస్థాన్‌ యుద్ధానికి దిగాయి

    1947
    2
  • గాంధీని గాడ్సే చంపాడు

    మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు

    1948
    3
  • రిపబ్లిక్ భారత్

    భారత్‌లో రాజ్యాంగం అమలులోకి రావడంతో గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది

    1950
    4
  • తొలి లోక్‌సభ ఎన్నికలు

    భారత్ స్వాతంత్య్రం తర్వాత మొదటి సార్వత్రిక ఎన్నికలను నిర్వహించింది

    1951
    5
  • తొలి భారత్- చైనా యుద్ధం

    సరిహద్దుపై వివాదం చెలరేగడంతో భారత్, చైనాల మధ్య యుద్ధం మొదలైంది

    1962
    6
  • నెహ్రూ మరణం

    మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కన్నుమూశారు. లాల్ బహదూర్ శాస్త్రి 1964, జూన్ 9న నూతన ప్రధాని అయ్యారు

    1964
    7
  • భారత్- పాకిస్థాన్ యుద్ధం

    కశ్మీర్‌ గురించి భారత్, పాకిస్థాన్ యుద్ధానికి దిగాయి. ఐరాస కాల్పుల విరమణ పిలుపుతో యుద్ధం ముగిసింది

    1965
    8
  • శాస్త్రి మృతి

    1965 భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తరువాతి రోజే లాల్‌ బహదూర్ శాస్త్రి తాష్కెంట్‌లో కన్నుమూశారు. ఇందిరా గాంధీ వెంటనే తదుపరి ప్రధాని అయ్యారు.

    1966
    9
  • రెండో భారత్- పాక్ యుద్ధం

    తూర్పు పాకిస్థాన్ గురించి భారత్, పాకిస్థాన్ మధ్య మరో పెద్ద యుద్ధం చెలరేగింది. బంగ్లాదేశ్ అవతరణతో ఇది ముగిసింది.

    1971
    10
  • ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ

    భారత్ తొలిసారిగా అణుబాంబు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది

    1974
    11
  • ఎమర్జెన్సీ ప్రకటన

    ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వార్తా పత్రికలపై ఉక్కుపాదం మోపారు. వేలాది మంది జైలు పాలయ్యారు. 1977 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది

    1975
    12
  • తిరిగి అధికారంలోకి ఇందిరా గాంధీ

    ఇందిరాగాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రధాని అయ్యారు

    1980
    13
  • క్రికెట్ ప్రపంచకప్ విజేతగా భారత్

    లార్డ్స్‌లో జరిగిన ఫైనల్స్‌లో వెస్టిండీస్‌ను ఓడించి భారత క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది

    1983
    14
  • అంతరిక్షంలోకి తొలిసారి భారతీయుడు

    మాజీ IAF పైలట్, వింగ్ కమాండర్ రాకేష్ శర్మ.. సోవియట్ ఇంటర్‌కోస్మోస్ ప్రోగ్రామ్‌లో భాగంగా సోయుజ్ T-11లో అంతరిక్షంలోకి ప్రయాణించారు

    1984
    15
  • ఆపరేషన్ బ్లూ స్టార్

    సిక్కులకు అత్యంత పవిత్రమైన అమృత్‌సర్‌లోని స్వర్ణ మందిరం నుంచి దమ్‌దామి తక్సల్, జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే సహా వారి అనుచరులను తొలగించేందుకు భద్రతా దళాలు సైనిక చర్యను ప్రారంభించాయి.

    1984
    16
  • ఇందిరా గాంధీ హత్య

    ఇందిరా గాంధీని తన సిక్కు అంగరక్షకులు హత్య చేశారు. ఆమె కుమారుడు రాజీవ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి

    1984
    17
  • భోపాల్ గ్యాస్ విషాదం

    భోపాల్‌లో ఉన్న అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ పురుగుమందుల ప్లాంట్ నుంచి ఘోరమైన గ్యాస్ లీక్ అయి 6,500 మంది మరణించారు

    1984
    18
  • కశ్మీర్ అల్లర్లు

    కశ్మీర్ లోయలో హింస చెలరేగింది, పాకిస్థాన్‌తో ఉద్రిక్తత నెలకొంది

    1989
    19
  • రాజీవ్ గాంధీ హత్య

    ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై తమిళనాడుకు చెందిన వ్యక్తి ఆత్మాహుతి దాడి

    1991
    20
  • తిరిగి అధికారంలోకి కాంగ్రెస్

    కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించింది. ప్రభుత్వం విస్తృతమైన ఆర్థిక సంస్కరణలను చేపట్టింది.

    1991
    21
  • బాబ్రీ మసీదు కూల్చివేత

    అయోధ్యలో కరసేవకులు 16వ శతాబ్దపు మసీదును కూల్చివేసి అది రామ జన్మభూమిగా పేర్కొన్నారు. ఈ ఘటన దేశవ్యాప్త ఉద్రిక్తతలకు దారితీసింది

    1992
    22
  • బాంబే వరుస పేలుళ్లు

    ముస్లిం అండర్‌వరల్డ్‌ ప్లాన్ చేసిన వరుస బాంబు పేలుళ్లతో దేశ వాణిజ్య రాజధాని బొంబాయి ఉలిక్కిపడింది. 257 మంది మరణించారు.

    1993
    23
  • అధికారంలోకి బీజేపీ

    అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది

    1998
    24
  • పోఖ్రాన్-II అణు పరీక్ష

    భారత ఆర్మీకి చెందిన పోఖ్రాన్ టెస్ట్ రేంజ్ వద్ద భారత్ 5 అణు బాంబు పరీక్షలు నిర్వహించింది. తర్వాత పాకిస్థాన్ కూడా సొంతంగా అణు పరీక్షలు చేసింది.

    1998
    25
  • కార్గిల్ యుద్ధం

    భారత కశ్మీర్‌లోని కార్గిల్ చుట్టూ పాకిస్థాన్ మద్దతు ఉన్న చొరబాటుదారులపై భారత్ దాడి చేసింది

    1999
    26
  • పార్లమెంటుపై దాడి

    భారత పార్లమెంటుపై ముష్కరులు దాడి చేశారు. పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాదులే ఈ దాడి చేసినట్లు భారత్ ఆరోపించింది. ఇస్లామాబాద్‌తో రవాణా సహా దౌత్య సంబంధాలను నిషేధించింది

    2001
    27
  • గోద్రా రైలు దహనం

    అయోధ్య నుంచి తిరిగి వస్తున్న 59 మంది హిందూ యాత్రికులు, కరసేవకులు గుజరాత్‌లోని గోద్రా సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదంలో మరణించారు.

    2002
    28
  • గుజరాత్ అల్లర్లు

    గోద్రా రైలు ప్రమాదం తర్వాతి రోజు, గుజరాత్‌లో రాష్ట్రవ్యాప్త అల్లర్లు ప్రారంభమయ్యాయి. అధికారికంగా 1,000 మందికి పైగా మరణించారు. బాధితులు ప్రధానంగా ముస్లింలు

    2002
    29
  • అధికారంలోకి యూపీఏ

    కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడంతో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు

    2004
    30
  • ముంబయి రైలు బాంబు దాడులు

    ముంబయిలోని సబర్బన్ రైల్వేస్వేషన్‌లో 11 నిమిషాల వ్యవధిలో జరిగిన ఏడు వరుస బాంబు పేలుళ్లలో 189 మంది మరణించారు.

    2006
    31
  • ముంబయి ఉగ్రదాడులు

    10 మంది ముష్కరులు జరిపిన వరుస ఉగ్రదాడులు ముంబయి సహా దేశాన్ని కుదిపేశాయి

    2008
    32
  • కొత్త ఉగ్రవాద నిరోధక చట్టాలు

    NIA, UAPA చట్టాలు, కొత్త యాంటీ టెర్రర్ రెగ్మీ అమలులోకి వచ్చాయి

    2009
    33
  • ప్రధానిగా మోదీ

    లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు

    2014
    34
  • పెద్ద నోట్ల రద్దు

    మోడీ ప్రభుత్వం మొత్తం ₹500, ₹1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ₹500, ₹2,000 నోట్లను విడుదల చేసింది

    2016
    35
  • సెక్షన్ 377 కొట్టివేసింది

    ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా IPCలోని సెక్షన్ 377ని రద్దు చేసింది. స్వలింగ సంపర్కం నేర కాదని తేల్చింది

    2018
    36
  • కరోనా మహమ్మారి

    భారత్‌లో తొలి కొవిడ్ -19 కేసు నమోదైంది. కేరళలో 20 ఏళ్ల మహిళకు వైరస్ పాజిటివ్‌ వచ్చింది

    2020
    37

భారత ప్రధానమంత్రులు

abp News abp News
  • జవహర్‌లాల్ నెహ్రూ

    జవహర్‌లాల్ నెహ్రూ

    15 ఆగస్టు 1947 నుంచి 27 మే 1964 వరకు (1889–1964)
  • గుల్జారీలాల్ నందా (ఆపద్ధర్మ)

    గుల్జారీలాల్ నందా (ఆపద్ధర్మ)

    27 మే 1964 నుంచి 9 జూన్ 1964 వరకు (1898-1998)
  • లాల్ బహదూర్ శాస్త్రి

    లాల్ బహదూర్ శాస్త్రి

    9 జూన్ 1964 నుంచి 11 జనవరి 1966 వరకు (1904–1966)
  • గుల్జారీలాల్ నందా (ఆపద్ధర్మ)

    గుల్జారీలాల్ నందా (ఆపద్ధర్మ)

    11 జనవరి 1966 నుంచి 24 జనవరి 1966 వరకు (1898-1998)
  • ఇందిరా గాంధీ

    ఇందిరా గాంధీ

    24 జనవరి 1966 నుంచి 24 మార్చి 1977 వరకు (1917–1984)
  • మొరార్జీ దేశాయ్

    మొరార్జీ దేశాయ్

    24 మార్చి 1977 నుంచి 28 జులై 1979 వరకు (1896–1995)
  • చరణ్ సింగ్

    చరణ్ సింగ్

    28 జులై 1979 నుంచి 14 జనవరి 1980 వరకు (1902–1987)
  • ఇందిరా గాంధీ

    ఇందిరా గాంధీ

    14 జనవరి 1980 నుంచి 31 అక్టోబర్ 1984 వరకు (1917–1984)
  • రాజీవ్ గాంధీ

    రాజీవ్ గాంధీ

    31 అక్టోబర్ 1984 నుంచి 2 డిసెంబర్ 1989 వరకు (1944–1991)
  • వీపీ సింగ్

    వీపీ సింగ్

    2 డిసెంబర్ 1989 నుంచి 10 నవంబర్ 1990 వరకు (1931–2008)
  • చంద్ర శేఖర్

    చంద్ర శేఖర్

    10 నవంబర్ 1990 నుంచి 21 జూన్ 1991 వరకు (1927–2007)
  • పీవీ నరసింహా రావు

    పీవీ నరసింహా రావు

    21 జూన్ 1991 నుంచి 16 మే 1996 వరకు (1921–2004)
  • అటల్ బిహారీ వాజ్‌పేయీ

    అటల్ బిహారీ వాజ్‌పేయీ

    16 మే 1996 నుంచి 1 జూన్ 1996 వరకు (1924- 2018)
  • హెచ్‌డీ దేవెగౌడ

    హెచ్‌డీ దేవెగౌడ

    1 జూన్ 1996 నుంచి 21 ఏప్రిల్ 1997 వరకు 1933 జననం
  • ఇందర్ కుమార్ గుజ్రాల్

    ఇందర్ కుమార్ గుజ్రాల్

    21 ఏప్రిల్ 1997 నుంచి 19 మార్చి 1998 వరకు (1919–2012)
  • అటల్ బిహారీ వాజ్‌పేయీ

    అటల్ బిహారీ వాజ్‌పేయీ

    19 మార్చి 1998 నుంచి 22 మే 2004 వరకు (1924-2018)
  • మన్మోహన్ సింగ్

    మన్మోహన్ సింగ్

    22 మే 2004 నుంచి 26 మే 2014 వరకు 1932 జననం
  • నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    26 మే 2014 - ప్రస్తుతం 1950 జననం