అన్వేషించండి

PM Modi On Nation First: మాకు దేశమే ముఖ్యం.. అందుకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నాం- ఏబీపీ సమ్మిట్‌లో ప్రధాని

Nation First: దేశమే అన్నింటికన్నా ముందు అని నమ్మడం వల్లే తాము పెద్ద నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఏబీపీ నెట్‌వర్క్ భారతమండపంలో నిర్వహించిన India@2047 సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు.

PM Modi On Nation First: బీజేపీ ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని,  సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. ఇంతటి ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి .. "దేశమే ముందు" Nation First  అనే భావనే కారణమని ఆయన అన్నారు.  బీజేపీ పదేళ్ల పాలనలో అనేక వ్యవస్థలను సంస్కరించామని.. చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోగలిగామన్నారు. ఎవరికో మేలు చేయాలనే ఓటుబ్యాంక్ రాజకీయాలు తాము చేయమని.. దేశం ముందు అందరూ ఒకటేనన్నారు. ABP Network నిర్వహించిన India@2047 సమ్మిట్‌లో ప్రధాని మాట్లాడారు. 

దేశమే ముందు.. 

వికసిత్ భారత్ పేరుతో అతిపెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు వెళ్లగలుగుతున్నామంటే.. భారత్ సామర్థ్యాన్ని తాము విశ్వసించడమే కారణమన్నారు. దేశం ఉన్నత స్థితికి వెళ్లడానికి కావలసిన సామర్థ్యం, వనరులు మన దగ్గర ఉన్నా.. ఇన్నాళ్లుగా దానిని నిర్లక్ష్యం చేశారని ఆయన కిందటి కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. జాతీయ భావన లేకుండా ఓటుబ్యాంక్ రాజకీయాలు చేయడం వల్ల దేశం వెనుకబడిందన్నారు. ఎవరికో మేలు చేయడం కోసం సంస్కరణలు ఆలస్యం చేయడం వల్ల భారత్ తీవ్రంగా నష్టపోయిందని మోదీ వ్యాఖ్యానించారు.

"స్వాతంత్రం తర్వాత దేశం కన్న అతిపెద్ద కల వికసిత్ భారత్.. అది సాధ్యమేనని ప్రధాని మోదీ అన్నారు. వందేళ్ల లక్ష్యాలను సాధించుకునే సామర్థ్యం, వనరులు భారత్‌కు ఉన్నాయని  మనం దానిని సాధిస్తామని ప్రధాని అన్నారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి  భారీ లక్ష్యాలను సాధించడానికి జాతీయభావం, దేశం సామర్థ్యం మీద నమ్మకం ఉండాలి. కానీ దురదుష్టవశాత్తూ.. కొన్ని దశాబ్దాల పాటు దీనికి దూరంగా ఉండిపోయాం.  అప్పట్లో నిర్ణయాలన్నీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం తీసుకున్నారు. దీనివల్ల మన అధికారం స్థిరపడుతుందా.. మన ఓటు బ్యాంక్ పోతుందా..  అనే భయాలతో స్వార్థ పూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయాం అన్నారు.  సంస్కరణలు అమలు చేయడంలో ఆలస్యం వల్ల దేశం నష్టపోయింది. ఏ దేశం కూడా ఇలా అభివృద్ధి చెందదు. ఏ దేశం ముందుకెళ్లాలన్నా… “ దేశమే ముందు (Nation First)”  అనే భావన" ఉండాలి అన్నారు, 

 దేశంలోని చిన్న బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బ్యాంకింగ్ సెక్టార్‌ను నష్టాల నుంచి కాపాడాం. గతంలో బ్యాంకుల నష్టాల ప్రస్తావన లేకుండా ఏ సదస్సులు ముగిసేవి కాదు. 2014కి ముందు బ్యాంకులు కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయి. దానికి మా ప్రభుత్వ తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణం ఎయిర్‌ ఇండియాను నష్టాల నుంచి కాపాడాం. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి లేదు. Nation First  అనే విధానం వల్లనే మేం ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగాం.

ట్రిపుల్‌ తలాఖ్, వక్ఫ్ సవరణ 

ట్రిపుల్ తలాఖ్ వల్ల ఈ దేశంలోని ముస్లిం మహిళలు ఎన్నో ఏళ్లుగా వేదనను అనుభవిస్తున్నారు. ఇన్నాళ్లుగా ఉన్న ప్రభుత్వాలు  వాళ్ల కన్నీళ్లు చూడలేదు. మేం మానవత్వంతో స్పందించాం. ట్రిపుల్ తలాఖ్ చట్టం.. మహిళలకు స్వాతంత్రాన్నిచ్చింది. వక్ఫ్ చట్టంపై కూడా అపోహలు పెట్టుకున్నారు. మేం ఏ పని చేసినా సామాజిక బాధ్యతతోనే చేశాం. మనుషులను ఓటు బ్యాంకులుగా ఎప్పుడూ చూడలేదు

 ఈ దశాబ్దమే మన భవితను నిర్ణయిస్తుంది

ఈ దశాబ్దం భారత్‌కు అత్యంత కీలకమైంది. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని ప్రధాని అన్నారు. “ ఈ దశాబ్దం అత్యంత ముఖ్యమైంది. దేశం కోసం కొత్త చరిత్రను లిఖించే సమయం ఇది. దేశ ప్రజలు, వ్యవస్థలన్నింటిలోనూ ఈ స్ఫూర్తి కనిపిస్తోంది” అని ప్రధాని మోదీ అన్నారు.

 ఏబీపీని అభినందిస్తున్నా..

వికసిత్ భారత్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఏబీపీ ఈ సదస్సును నిర్వహించడాన్ని ప్రధాని అభినందించారు. ఉదయం నుంచి చూస్తున్నా.. భారత్ మండపంలో వైవిధ్యం కనిపిస్తోంది. డ్రోన్ దీదీలు, సోలార్ దీదీలు ఈ వేదికపై కనిపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సమ్మిట్ దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
2027 ODI World Cup Venues: 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా నేలపై మెగా టోర్నీ .. 2027 వన్డే వరల్డ్ కప్ వెన్యూస్ అనౌన్స్, 12 మైదానాల్లో గేమ్స్!
24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా నేలపై మెగా టోర్నీ .. 2027 వన్డే వరల్డ్ కప్ వెన్యూస్ అనౌన్స్, 12 మైదానాల్లో గేమ్స్!
Sachin Guard Secret: సచిన్  241 రన్స్ ఎపిక్ ఇన్నింగ్స్ వెనుక ఆకాష్ చోప్రా హెల్ప్.. డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ బయటపెట్టిన మాజీ ఓపెనర్!
సచిన్  241 రన్స్ ఎపిక్ ఇన్నింగ్స్ వెనుక ఆకాష్ చోప్రా హెల్ప్.. డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ బయటపెట్టిన మాజీ ఓపెనర్!
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget