అన్వేషించండి

Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!

Kancharapalem Murdr: విశాఖపట్నం కంచరపాలెం ఆటో డ్రైవర్ సురేష్ దారుణం. పెళ్లి నిలదీసిందని హత్య చేసి మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి రాయగడలో పడేశాడు. సెల్ సిగ్నల్స్‌తో అరెస్ట్.

Visakhapatnam Suitcase Murder Case Suresh: విశాఖపట్నం నగరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసిందనే ఏకైక కక్షతో, ఒక యువతిని దారుణంగా హత్య చేసి.. ఆపై మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. కంచరపాలెం దుర్గానగర్ ప్రాంతానికి చెందిన బొలిశెట్టి సురేష్ అనే ఆటో డ్రైవర్ చేసిన ఈ ఘాతకం, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా పక్కా స్కెచ్ ప్రకారం సాగింది.

బాధితురాలు సంధ్యతో సురేష్‌కు కొంతకాలంగా పరిచయం ఉండగా, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే, గత కొన్ని రోజులుగా పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. తను చెప్పినట్లు వినడం లేదనే కోపంతో, పక్కా పథకం ప్రకారం ఆమెను కడతేర్చాలని సురేష్ నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఆమెపై దాడి చేసి అత్యంత క్రూరంగా హత్య చేసిన అనంతరం, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఓ పెద్ద ట్రాలీ బ్యాగ్‌లో కుక్కి సీల్ చేశాడు.

హత్య చేసినంత సులభంగా ఆధారాలు దాచలేమని గ్రహించిన నిందితుడు.. మృతదేహం ఉన్న సూట్‌కేస్‌ను ఎవరికీ దొరక్కుండా దూర ప్రాంతానికి తరలించాలని ప్లాన్ వేశాడు. విశాఖలోని జ్ఞానాపురం రైల్వే స్టేషన్‌కు ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లి, అక్కడ నుంచి ఒడిశా వైపు వెళ్లే రైలులో వేసి రాయగడకు చేరుకున్నాడు. రాయగడ సమీపంలోని ఖాలిగుడా వద్ద ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో ఆ ట్రాలీ బ్యాగ్‌ను పడేసి, ఏమీ తెలియనట్లు మళ్లీ విశాఖకు చేరుకుని ఎప్పట్లాగే ఆటో నడుపుకోవడం ప్రారంభించాడు.                   

అయితే, ఖాలిగుడా వద్ద దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గుర్తించి ఒడిశా పోలీసులకు సమాచారం అందించారు. సూట్‌కేస్ తెరిచి చూసిన పోలీసులకు మృతదేహం లభించడంతో వెంటనే విచారణ వేగవంతం చేశారు. రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు సీసీటీవీ దృశ్యాలు, సైబర్ సెల్ సహాయంతో సెల్‌ఫోన్ టవర్ సిగ్నల్స్ ,  డేటాను విశ్లేషించాయి. హత్య జరిగిన రోజున జ్ఞానాపురం స్టేషన్ నుంచి రాయగడ వరకు బాధితురాలి ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన ప్రదేశాలు, సురేష్ మూవ్‌మెంట్స్‌ను సాంకేతికంగా మ్యాపింగ్ చేయడంతో నిందితుడి గుట్టు రట్టయింది.                             

పోలీస్ వాహనాలకు ఆప్టింగ్ డ్రైవర్‌గా కూడా పనిచేస్తూ పోలీసుల కదలికలపై అవగాహన ఉన్న సురేష్.. సాంకేతిక ఆధారాల ముందు చివరకు దొరికిపోయాడు. ఒడిశా పోలీసు బృందం కంచరపాలెం పోలీసుల సహకారంతో సురేష్‌ను విశాఖలో అదుపులోకి తీసుకుంది. పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక పక్కా క్రైమ్ థ్రిల్లర్ తరహాలో సాగిన ఈ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget