అన్వేషించండి
Chevella Road Accident Photos: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. నడుం లోతు కంకరలో ఇరుక్కుని నరకయాతన.. భయానక దృశ్యాలు
Rangareddy Road Accident Photos | రంగారెడ్డి జిల్లాలో తాండూరు డిపో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టిన ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం
1/8

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును, రాంగ్ రూటులో వచ్చిన కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. అనంతరం బస్సు మీద లారీ ఒరిగి పడిపోయింది.
2/8

లారీ లోని కంకర లోడ్ వర్షం కురిసినట్లుగా బస్సులోని వారిని కమ్మేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు.
3/8

కొందరు ప్రయాణికులు ఆ కంకర కింద ఊపిరాడక చనిపోయారు. కొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
4/8

నడుము లోతు వరకు కంకర రాళ్లు కప్పేయడంతో బస్సు నుంచి బయటకు రాలేక ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.
5/8

జేసీబీల సాయంతో బస్సులో చిక్కుకున్న వారిని కొందర్ని కాపాడి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను సైతం బస్సు నుంచి వెలికితీశారు.
6/8

ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మృతిచెందగా, మరికొందరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
7/8

కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారం అందిస్తామని ప్రకటించింది.
8/8

ఢీకొట్టిన తరువాత కంకర లోడుతో ఉన్న లారీ బస్సు మీద ఒరగడంతో ప్రాణ నష్టం అధికంగా సంభవించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Published at : 03 Nov 2025 01:59 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















