OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
AQI Illusion: కాలుష్యంపై భారత పోరాటంలో నిర్మాణాత్మక లోపాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా డేటాను సమీకరించలేకపోతున్నారు.

India Pollution Fight: ముంబై నగర వాయు కాలుష్య సంక్షోభంపై బాంబే హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి ఏళ్లు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడానికి ప్రధాన కారణం డేటా లేకపోవడం . నిబంధనల అమలు లో వైఫల్యమేనని స్పష్టమవుతోంది. గాలి నాణ్యత (AQI) క్షీణతకు, ఊపిరితిత్తుల వ్యాధులకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పేర్కొనడం అందరి దృష్టిపథంలో ఉంది. అదే సమయంలో అసలు దానికి సంబంధం ఉందో లేదో నిర్థారించే డేటా సేకరణ మాత్రం జరగలేదు. అది యాధృచ్చికమో.. లేక నిజంగానే కనెక్షన్ ఉందో తెలీదు కానీ.. ప్రభుత్వం " గాలి కాలుష్యకారకమైన వ్యాధులపై పోరాటానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నాం.." అని చెబుతూ ఉంటుంది.
పనిచేయని సెన్సార్లు.. కాగితాలకే పరిమితమైన నిబంధనలు
సెన్సార్లు పనిచేయకపోవడం అన్నది గాలి కాలుష్యం విషయానికి సంబంధించిన ఆందోళనలో ఒక పరిపాటిగా మారిపోయింది. కాలుష్య నియంత్రణ సెన్సార్లు అనేకచోట్ల పని చేయడం లేదని బాంబే హైకోర్టు స్వయంగా గుర్తించింది. నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్య నివారణ మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అధికారిక డేటా అంతా బాగున్నట్లు భ్రమింపజేస్తున్నా, జనం అనుభవిస్తున్న కాలుష్యం మాత్రం వేరే కథ చెబుతోంది. జనసాంద్రతకు అనుగుణంగా సెన్సార్ నెట్‌వర్క్ లేకపోవడంతో, కోర్టులు కూడా సరైన సమాచారం లేని శూన్య స్థితిలో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది.
కనిపించని ప్రాణసంకటం - ఆర్థిక భారం
పాండమిక్ తర్వాత మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం వాయు కాలుష్యమే అయినప్పటికీ, దీనిపై తగినంత శ్రద్ధ లేకపోవడం విచారకరం. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో శ్వాస పీల్చడం అంటే రోజుకు పదుల సంఖ్యలో సిగరెట్లు తాగడంతో సమానమని వార్తలు వస్తున్నా, జనం దాన్ని అలవోకగా తీసుకుంటున్నారు. ఇది కేవలం ఆరోగ్య సమస్యే కాదు, పెరుగుతున్న వైద్య ఖర్చుల వల్ల దేశంపై భారీ ఆర్థిక భారంగా పరిణమిస్తోంది. ముక్కలు ముక్కలుగా ఉన్న నిబంధనలు, ఆచరణకు సాధ్యం కాని విధానాల వల్ల వాయు స్వచ్ఛత లక్ష్యాలు నెరవేరడం లేదు.
ఈ పరిస్థితికి చాలా కారణాలున్నాయి. సరైన నియంత్రణలు లేకపోవడం...వాటిని అమలు చేయడంలో సమన్వయ లోపం, ఆశావహ విధానాలు లేకపోవడం.. వాస్తవికత ఆధారంగా పనిచేయకపోవడం ఇవన్నీ కారణాలే. స్వచ్చమైన గాలి కోసం మనం విధించుకునే లక్ష్యాలు..వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాల మధ్య సమతుల్యం కూడా అవసరమే.
నా దృష్టిలో, ఇవన్నీ రెండు ప్రధాన లోపాలున్నాయి. ఒకటి డేటా లేకపోవడం.. అదే ముఖ్యమైంది. ఇక రెండోది ప్రత్యక్ష ఆర్థిక ప్రోత్సాహకాలు, జరిమానాలు లేకపోవడం. (కాలుష్య నియంత్రణకు సంబంధించి) ఈ వ్యాసంలో ప్రస్తావించిన ఇతర కారణాలు సహా మిగతా అన్ని అంశాలు..ఈ మొదటి లోపాన్ని సరిదిద్దకుండా పరిష్కరించలేము.
పరిష్కార మార్గాలు: డేటా ప్రాధాన్యత, ఆర్థిక ప్రోత్సాహకాలు
కాలుష్యాన్ని నియంత్రించాలంటే ప్రతి వార్డులో, ప్రతి లోకాలిటీలో తక్కువ ఖర్చుతో కూడిన ఆధునిక సెన్సార్లను ఏర్పాటు చేయాలి. కేవలం ముంబైని మాత్రమే కాకుండా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) మొత్తాన్ని ఒకే 'ఎయిర్ షెడ్'గా పరిగణించి అధ్యయనం చేయాలి. సముద్రపు గాలుల వల్ల కాలుష్యం ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుతుందో తెలిస్తేనే మూలాలను అరికట్టగలం. 2023లో IIT బాంబే, NEERI వంటి సంస్థలు ఇచ్చిన నివేదికలను ఇప్పటికైనా అమలు చేయాలి. వీటితో పాటు, కాలుష్యం తగ్గించే వారికి పన్ను రాయితీలు ఇవ్వడం, ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించడం వంటి 'ఫిస్కల్ ఇన్సెంటివ్స్' విధానాన్ని ప్రవేశపెట్టాలి. బలమైన రాజకీయ సంకల్పం లేకపోతే, మనం పీల్చే గాలిని చూస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోనే ఉండిపోతాం.
(The author is a Managing Partner at Bharucha & Partners)
Disclaimer: The opinions, beliefs, and views expressed by the various authors and forum participants on this website are personal and do not reflect the opinions, beliefs, and views of ABP Network Pvt. Ltd.





















