Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Tataiahgunta Gangamma Temple: తిరుమల శ్రీవారి చెల్లెలు తాతయ్యగుంట అమ్మవారిని కథానాయిక అనన్య నాగళ్ళ దర్శించుకున్నారు. అనంతరం ఏడు కొండల స్వామివారి దర్శనం చేసుకున్నారు.

'పుష్ప 2' సినిమాలో గంగమ్మ జాతర ఫైట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు, ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ఆ తర్వాత గంగమ్మ జాతర గురించి ఎక్కువ మందికి తెలిసింది. ఇంతకీ, ఆ గంగమ్మ ఎవరో తెలుసా? ఏడు కొండల వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలు. తిరుమల వెళ్లిన భక్తులు కొంత మందికి తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని సైతం దర్శించుకుంటారు. ఇప్పుడీ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ సైతం చొరవ కనబరుస్తోంది. తాజాగా కథానాయిక అనన్యా నాగళ్ళ ఆ ఆలయానికి వెళ్ళారు.
తాతయ్యగుంట అమ్మవారి విశిష్ఠత విన్నాను!
Ananya Nagalla: తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లోనూ ప్రస్తుతం అనన్యా నాగళ్ళ నటిస్తున్నారు. ఓ తమిళ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా తాతాయ్యగుంట అమ్మవారిని ఆమె దర్శనం చేసుకున్నారు. అనంతరం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తాతయ్యగుంట అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ యాదవ్ దగ్గరుండి మరీ పూజా కార్యక్రమాలు అన్ని జరిపించారు. అనన్యా నాగళ్ళను ఆలయానికి ఆహ్వానించిన ఆయన... పూజ ముగిసిన తర్వాత తీర్థ ప్రసాదాలు అందించారు.
Also Read: Adivi Sesh: తిరుమల ప్రసాదం టేస్టీగా ఉంది... లడ్డూ వివాదంలో పరోక్షంగా వైసీపీకి అడివి శేష్ కౌంటర్?
Actress @AnanyaNagalla participated in the auspicious Tirupati Gangamma Jathara celebrations at Tataiah Gunta, Tirupati, and was felicitated by Chairman Mahesh Yadav. #AnanyaNagalla pic.twitter.com/dv0qapQawn
— VRMadhuPR (@VRMadhuPR) February 27, 2026
తాతయ్యగుంట అమ్మవారి ఆలయం గురించి అనన్య నాగళ్ళ మాట్లాడుతూ... ''నేను అమ్మవారిని దర్శించుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నా. ఇప్పటికి ఆ అమ్మవారి అనుగ్రహం కలిగింది. నాకు దర్శించుకునే సమయం వచ్చింది. అమ్మ విశిష్ఠత గురించి ఎన్నోసార్లు విన్నాను. తాజాగా దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను'' అని అన్నారు. గతంలో తాతయ్యగుంట అమ్మవారి దేవాలయాన్ని కథానాయిక మీనాక్షి చౌదరి సైతం దర్శించుకున్నారు.
Also Read: Rashmika Mandanna: దేవరకొండ ఇంట్లో రష్మిక గృహ ప్రవేశం... వైరల్ వీడియో చూశారా?
'వకీల్ సాబ్', 'మల్లేశం', 'పొట్టేల్', 'తంత్ర' తదితర సినిమాల్లో అనన్యా నాగళ్ళ నటించారు. తాను ఎప్పుడు, ఎక్కడ ఉన్నా సరే తనలో దైవభక్తి తగ్గదని, అలాగే ఉంటుందని ఆమె చెప్పారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామివారిని ఆమె దర్శించుకున్నారు.






















