PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kakinada Fire Cracker Explosion | సామర్లకోటలోని బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కేంద్రం పరిహారం ప్రకటించింది.

Kakinada Fire Cracker Explosion | సామర్లకోట: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలోని వేట్లపాలెంలో ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు మరణించారనే వార్త అత్యంత విచారకరం అని, ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు రాష్ట్రపతి ముర్ము. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
आंध्र प्रदेश के काकीनाड़ा जिले में एक फैक्ट्री में हुए विस्फोट के कारण अनेक लोगों की मृत्यु का समाचार अत्यंत दुखद है। मैं शोक संतप्त परिवारों के प्रति गहन संवेदना व्यक्त करती हूं। इस दुर्घटना में घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की मैं कामना करती हूं।
— President of India (@rashtrapatibhvn) February 28, 2026
ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి - ఎక్స్‌గ్రేషియా ప్రకటన
కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా పేలుడు ఘటన అత్యంత బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పీఎం సహాయ నిధి (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Pained by the loss of lives in the explosion at a factory in Kakinada district of Andhra Pradesh. I extend my condolences to those who lost their loved ones. May the injured recover soon.
— PMO India (@PMOIndia) February 28, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased.…
వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అనేకమంది కార్మికులు మందుగుండు సామాగ్రిని తయారు చేస్తున్నారు. పేలుడు తీవ్రతకు భవనం కుప్పకూలడంతో పాటు మంటలు వ్యాపించడంతో ఇప్పటివరకు 21 మంది మరణించినట్లు సమాచారం.. మృతదేహాలు ఛిద్రమై హృదయవిదారకంగా పడి ఉండటాన్ని చూసి స్థానికులు, అధికారులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. కొందరి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి.

ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికుల సహాయంతో వెంటనే 108 అంబులెన్స్‌ల ద్వారా కాకినాడ జీజీహెచ్‌కు తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. 2 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేశాయి. కానీ అప్పటికే జరిగాల్సిన నష్టం జరిగిపోయింది.
























