అన్వేషించండి

Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్

Sahibzada Farhan Stats: ఒకే టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సాహిబ్‌జాదా ఫర్హాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించడానికి అతను విరాట్ కోహ్లీని అధిగమించాడు.

Most Runs in Single T20 World Cup Series: ఒకే టీ20 వరల్డ్ కప్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సాహిబ్‌జాదా ఫర్హాన్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి పాక్ ఓపెనర్  సాహిబ్‌జాదా ఫర్హాన్ ఈ ఘనత సాధించాడు. సూపర్ 8లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో 38 పరుగులు పూర్తి చేయగానే ఫర్హాన్, విరాట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఫర్హాన్ ఇప్పటివరకు ఇదే వరల్డ్ కప్‌లో 3 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేయగా.. ఈ మ్యాచ్ లోనూ సెంచరీ సాధించాడు. దాంతో ఓ టీ20 వరల్డ్ కప్ లో రెండు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు.

విరాట్ కోహ్లీ రికార్డు బద్ధలు
ఇంతకుముందు ఒకే టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. విరాట్ 2014 వరల్డ్ కప్‌లో 319 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌కు ముందు వరకు సాహిబ్‌జాదా ఫర్హాన్ 283 పరుగులతో ఉన్నాడు. శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేసే క్రమంలో పాక్ ఓపెనర్ ఈ రికార్డును నెలకొల్పాడు. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు ఫర్హాన్ (100), ఫఖర్ జమాన్ (84) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది.

ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు

సాహిబ్‌జాదా ఫర్హాన్ (PAK) - 383+ పరుగులు

విరాట్ కోహ్లీ (IND) - 319 పరుగులు

తిలకరత్నే దిల్షాన్ (SL) - 317 పరుగులు

బాబర్ ఆజం (PAK) - 303 పరుగులు

మహేల జయవర్ధనే (SL) - 302 పరుగులు

విరాట్ కోహ్లీ 2014 టీ20 వరల్డ్ కప్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో 106.33 సగటుతో 319 పరుగులు సాధించాడు. ఆ టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ బ్యాటింగ్ లో రాణించి 4 అర్థ సెంచరీలు చేశాడు. ఇది కాకుండా విరాట్ కోహ్లీ 2022 వరల్డ్ కప్‌లో కూడా 296 పరుగులు చేశాడు.

టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిందెవరు 
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ విరాట్ కోహ్లీ పేరిటనే ఉంది. విరాట్ తన వరల్డ్ కప్ కెరీర్‌లో 33 ఇన్నింగ్స్‌ల్లో 1,292 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో కూడా భారత్‌కు చెందిన రోహిత్ శర్మ ఉన్నాడు. తన టీ20 వరల్డ్ కప్ కెరీర్‌లో హిట్ మ్యాన్ 1,220 పరుగులు చేశారు. వీరిద్దరికీ అత్యంత సమీపంలో జోస్ బట్లర్ ఉన్నాడు, బట్లర్ ఇప్పటివరకు 1,075 పరుగులు చేశాడు.

శ్రీలంకకు ఏమాత్రం ఊరట లభించడం లేదు. షనక వేసిన 15వ ఓవర్ మొదటి బంతికే ఫర్హాన్ స్ట్రెయిట్ సిక్సర్ బాదాడు. దీనితో ఫఖర్ జమాన్, ఫర్హాన్ మధ్య భాగస్వామ్యం 156 పరుగులకు చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ తరపున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. 2021లో భారత్‌పై బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ నెలకొల్పిన 152 పరుగుల అజేయ భాగస్వామ్యమే అత్యుత్తమ రికార్డుగా ఉండేది. నేటి మ్యాచులో ఫఖర్ జమాన్, ఫర్హాన్ జోడీ ఏకంగా 176 పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ T20 World Cup: గ్రహాలు కలిసొస్తాయి కానీ ముందు నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరకు సంజూ శాంసన్ జర్నీ!
గ్రహాలు కలిసొస్తాయి కానీ ముందు నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరకు సంజూ శాంసన్ జర్నీ!
T20 World Cup Prize Money: టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
T20 World Cup Winner: టీ20 వరల్డ్ కప్ విజేత టీమిండియా.. ఫైనల్లో కివీస్ చిత్తు చిత్తు - సూర్య సేన సరికొత్త చరిత్ర
టీ20 వరల్డ్ కప్ విజేత టీమిండియా.. ఫైనల్లో కివీస్ చిత్తు చిత్తు - సూర్య సేన సరికొత్త చరిత్ర
Ind vs NZ Final Highights: 72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్.. చరిత్రకు అడుగు దూరంలో భారత్
72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్.. చరిత్రకు అడుగు దూరంలో భారత్
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup Prize Money: టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Cooking Gas Saving Tips : గ్యాస్ ఆదా చేయాలంటే వంట చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఖర్చు తగ్గుతుంది
గ్యాస్ ఆదా చేయాలంటే వంట చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఖర్చు తగ్గుతుంది
Vastu Tips : ఇంట్లో డబ్బులు ఉండట్లేదా? కారణాలు ఇవే.. ఈ మార్పులు చేసి చూడండి, ఖర్చులు తగ్గొచ్చు
ఇంట్లో డబ్బులు ఉండట్లేదా? కారణాలు ఇవే.. ఈ మార్పులు చేసి చూడండి, ఖర్చులు తగ్గొచ్చు
Embed widget