అన్వేషించండి

Israel Strike On Iran: ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి

టెహ్రాన్‌లోని భారత పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తరలింపు ప్రయత్నాలను ఆలస్యం చేయవద్దని ఓ విద్యార్థిని భావోద్వేగపూరితమైన విజ్ఞప్తి చేశారు.

Israel Strike On Iran | టెహ్రాన్: ఇజ్రాయెల్ చేస్తున్న డ్రోన్ దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.  వైమానిక దాడులు ఉధృతం కావడంతో, అక్కడ ఉన్న ఒక భారత విద్యార్థిని వెంటనే తమను స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఒక వీడియోలో ఆమె అక్కడి పరిస్థితి గందరగోళంగా, దారుణంగా ఉందని వివరించారు. భారతీయుల భద్రత కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

"నేను ఒక భారత విద్యార్థిని, ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్నాను. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా, భయంకరంగా ఉంది. తరువాత ఏం జరుగుతుందో మాకు అస్సలు తెలియడం లేదు" అని విద్యార్థి ఆ వీడియోలో పేర్కొన్నారు.

వేగవంతమైన చర్యల కోసం విద్యార్థిని విన్నపం

ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితులను వివరించించిన ఆ విద్యార్థిని భారత అధికారులు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలుపుతూనే, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా తరలింపు ప్రక్రియలో వేగం పెంచాలని కోరారు. "మా భద్రత గురించి భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్చిస్తున్నందుకు వారికి కృతజ్ఞుత చెబుతున్నాను. కానీ ఇటువంటి సమయాల్లో వేగం చాలా ముఖ్యం" అని ఆమె అన్నారు. వైమానిక దాడుల తీవ్రత కారణంగా తాను సరిగ్గా మాట్లాడలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైమానిక దాడులు జరుగుతున్నాయి, మా పరిస్థితి మరింత దిగజారుతోంది. అందుకే నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అని పేర్కొన్నారు.

‘దయచేసి వేచి చూడకండి’: రక్షణ కోసం భావోద్వేగ విన్నపం

ఇరాన్ లో చిక్కుకున్న విద్యార్థుల తరలింపు ప్రయత్నాలలో జాప్యం చేయవద్దని, టెహ్రాన్‌లోని భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అధికారులను కోరారు. ‘వీలైనంత త్వరగా తరలింపు ప్రక్రియను చేపట్టాలని కోరుతున్నాము. దయచేసి పరిస్థితి ఇంకా దారుణంగా మారే వరకు వేచి చూడకండి. సాధ్యమైనంత వెంటనే మాకు సహాయం చేయండి. దయచేసి మమ్మల్ని వీలైనంత త్వరగా ఇక్కడి నుండి బయటపడేయండి’ అని ఆ విద్యార్థిని రిక్వెస్ట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget