ఆగస్టు 15
స్వాతంత్య్ర దినోత్సవం 2026
సీ మోర్Advertisement
స్వాతంత్య్ర దినోత్సవం 2026
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తిని, ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. ఈ ప్రత్యేక సందర్భంగా ABP మీకు స్వాతంత్ర్య దినోత్సవం, భారత స్వాతంత్ర్య సంగ్రామం ప్రయాణాన్ని తెలుపుతుంది.
భారత్ ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం సాధించింది. దేశ చరిత్రలో నిలిచిపోతే రోజు ఇది. స్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తును నిర్మించాలనే ఆకాంక్షకు పునరంకితం కావడానికి ఈ తేదీ నేటికీ దేశాన్ని ప్రేరేపిస్తూనే ఉంది. ఈ ఏడాది భారతదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది.
ప్రతి ఏడాది ఈ చారిత్రకమైన రోజు ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగం కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇది జాతీయ వేడుకల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఆకాశంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడే దృశ్యం ప్రజల గుండెల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తుంంది. దేశమంతా గర్వం, దేశభక్తి భావనతో ఈ సందర్భంగా ఏకమవుతుంది.
ఎందరో త్యాగాల వల్ల భారత్ స్వాతంత్య్రాన్ని సాధించిన రోజును పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధులైన అమరవీరులకు ప్రజలు నివాళి అర్పిస్తారు. వారి విజయగాథలు తరతరాలకు స్పూర్తినిస్తూ వేడుకల కేంద్రబిందువుగా నిలుస్తున్నాయి. వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ప్రస్తుత విజయాలపై గర్విస్తూ 'వికసిత్ భారత్' సంకల్పంతో భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాం. ఈ తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ స్పూర్తి దేశమంతటా మార్మోగుతోంది."
Independence Day Quiz
Independence Day Wishes
Advertisement
ఫొటో గ్యాలరీ
చూడండి
FAQs
భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటుంది ?
ఏ దేశం నుంచి భారత్ స్వాతంత్ర్యం సాధించుకుంది ?
బ్రిటన్ (యునైటెడ్ కింగ్‌డమ్)
స్వతంత్ర భారతావనికి మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
లార్డ్ మౌంట్‌బాటన్ (లూయిస్ మౌంట్‌బాటన్) స్వతంత్ర భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్
1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వేళ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించింది ఎవరు?
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో సంకేతం) పేరుతో ఆ కీలక ప్రసంగం చేశారు
భారత్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అధికారికంగా ఎక్కడ నిర్వహిస్తారు ?
ఎర్రకోట, ఢిల్లీ













