Independence Day 2025 Rangoli Designs : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముగ్గులు వేయాలనుకుంటున్నారా? బెస్ట్ రంగోలి డిజైన్స్ ఇవే
Independence Day 2025 : ఆగస్టు 15వ తేదీరోజు మీరు ఇంట్లో లేదా ఆఫీసులో, స్కూళ్లో వేయడానికి రంగోలి డిజైన్స్ కోసం చూస్తున్నారా? అయితే ఇవి బెస్ట్. వేయడానికి 6 సులభమైన రంగోలి డిజైన్లు చూడండి.

Independence Day 2025 Rangoli Designs : స్వాతంత్య్ర దినోత్సవం 2025 వచ్చేసింది. మీరు ఉండే ప్రదేశాల్లో దేశభక్తిని ప్రతిబింబించే డెకరేషన్స్ చేస్తున్నారా? అయితే వాటితో పాటు ముగ్గులను కూడా వేసేయండి. పండుగల సమయంలోనే కాకుండా.. రంగు రంగుల ముగ్గులు వేయడానికి స్వాతంత్య్ర దినోత్సవం కూడా మంచి ఆప్షనే. కాబట్టి మీ ఇంటిని, కార్యాలయాన్ని లేదా ఇతర స్థలాల్లో.. త్రివర్ణ రంగులతో కూడిన రంగోలి డిజైన్‌లు వేయొచ్చు. ఇవి మంచి ఫెస్టివల్ వైబ్‌ని ఇస్తాయి. ఆగస్టు 15వ తేదీన రంగోలిలు వేసి.. మీ సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హైలైట్ చేసే ముగ్గులను ఇప్పుడు చూసేద్దాం.
మూడురంగులతో.. పువ్వులతో..
(Image Source: ABPLIVE AI)
భారతీయ జెండాను సూచించే విధంగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో ఉండే పువ్వులు, ఆకులతో వేయగలిగే సింపుల్ డిజైన్ ఇది. ముందుగా వృత్తాకార వేసి.. దానిని మూడు సమాన భాగాలుగా చేయాలి. పైన ఉన్న భాగాన్ని కాషాయం కోసం బంతి పువ్వు రేకులతో, మధ్య భాగాన్ని తెలుపు కోసం జాస్మిన్ రేకులతో, దిగువ భాగాన్ని ఆకుపచ్చ ఆకులతో నింపాలి. పొడిచేసిన నీలిరంగుతో మధ్యలో నీలిరంగు అశోక చక్రాన్ని జోడించండి. ఇది ఇంటి దగ్గర, కార్యాలయాలకు వేసేందుకు అనువైనది. ఎందుకంటే ఇది రిఫ్రెష్ లుక్ ఇవ్వడంతో పాటు దేశభక్తిని సూచిస్తుంది. ఈ రంగోలి చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా సహజమైన సువాసనను అందిస్తుంది.
జెండా ముగ్గు
(Image Source: ABPLIVE AI)
సర్కిల్ వేయడం కష్టం అనుకుంటే స్కేల్ లాంటిది ఉపయోగించి గీతలు గీసి.. జెండాను గీయవచ్చు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండాను రంగోలిగా వేయడమనేది అద్భుతమైన ఎంపిక. దీనికోసం పెద్ద దీర్ఘచతురస్రాన్ని వేసి.. మూడు భాగాలుగా విభజించాలి. కాషాయం, ముగ్గు, పచ్చని రంగులతో వాటిని నింపాలి. నీలిరంగుతో అశోక చక్రం వేయాలి. ఈ డిజైన్ కార్యాలయ ప్రవేశ ద్వారాలు లేదా లాబీలకు ప్రత్యేకంగా సరిపోతుంది. ట్విస్ట్ కోసం రంగోలి చుట్టూ చిన్న దీపాలను ఉంచవచ్చు.
అశోక చక్ర రంగోలి
కేంద్ర బిందువైనా.. అశోక చక్రాన్ని హైలైట్ చేస్తూ ముగ్గు వేయవచ్చు. భారతదేశం పురోగతి, ఐక్యతను ఇది సూచిస్తుంది. ఒక పెద్ద వృత్తాన్ని గీసి.. దానిని కాషాయం, పచ్చని రంగులో వేయవచ్చు. లోపలి వృత్తాన్ని స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంచాలి. నీలిరంగుతో అశోక చక్రాన్ని వేయవచ్చు. చక్రం అన్ని కోణాల నుంచి చూడటానికి ఆహ్లాదకరంగా డిజైన్ చేయవచ్చు. ఇది కళాత్మకతను దేశభక్తి చిహ్నంతో సమతుల్యం చేసే అధునాతన ఎంపిక అవుతుంది.
నెమలితో త్రివర్ణ రంగోలి
భారతదేశపు జాతీయ పక్షి అయిన నెమలిని ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు వేయవచ్చు. సాంస్కృతికమైన రంగోలి థీమ్‌ను ఇది సూచిస్తుంది. ముందుగా ఫోటోలో చూపించినట్లు.. నెమలిని వేయాలి. అనంతరం త్రివర్ణ జెండాను సూచించేవిధంగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను మీ శైలిలో ఈకలను నింపండి. నెమలి శరీరం వైబ్రెంట్ బ్లూస్, పర్పుల్స్‌లో వేయవచ్చు. దీనిని ఇంటి దగ్గర, కార్యాలయం దగ్గర వేయవచ్చు.
ఇండియా మ్యాపే రంగోలిగా
నిజంగా దేశభక్తిని చూపించాలనుకుంటే మీరు ఇండియా మ్యాప్‌ని రంగోలిగా వేయవచ్చు. తెల్లని ముగ్గుతో ముందుగా మ్యాప్ వేయాలి. దానిని మూడు భాగాలుగా విభజించి.. కాషాయం, తెల్లని, పచ్చని రంగులతో నింపవచ్చు. ఇది ఐక్యతను సూచిస్తుంది. అలాగే మధ్యలో ఒక చిన్న అశోక చక్రాన్ని వేస్తే.. లుక్ మరింత అందంగా ఉంటుంది. ఈ డిజైన్ జాతీయ గర్వాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. బహిరంగ ప్రదేశాలు, స్కూల్, కార్పొరేట్ కార్యాలయాల్లో వీటిని వేయవచ్చు.






















