Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
2027 వరల్డ్ కప్ లో ప్లేస్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్లే ప్రతీ మ్యాచ్ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు టీమిండియాలో ఉంది. ఇలాంటి టైమ్ లో బ్యాడ్ లక్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్ లో బ్యాట్ తో రప్ఫాడించినా పంజాబ్ ను 14 ఏళ్ల తర్వాత కెప్టెన్ గా ఫైనల్ కి తీసుకువెళ్లినా...కనీసం టీ20 టీమ్ లో చోటు దక్కించుకోలేకపోతున్న అయ్యర్...మొన్న టీ20 వరల్డ్ కప్ లో జట్టులోనూ సెలక్షన్ కమిటీ దృష్టిలోనే లేడు. మరోవైపు అయ్యర్ ను వన్డే ఆటగాడిగా చూస్తున్న కోచ్ గంభీర్ తనను ఎందుకో కానీ వన్డే టీమ్ వైస్ కెప్టెన్ ని చేశాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అక్టోబర్ లో ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలతో జరిగిన వన్డే సిరీస్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్యర్ రెండు నెలలుగా రెస్ట్ లోనే ఉన్నాడు. ఒకానొక టైమ్ లో అయ్యర్ ను ఐసీయూలో పెట్టారంటూ కూడా వార్తలు వచ్చాయి. బాల్ ను ఆపే క్రమంలో అతని పొత్తి కడుపులో గాయమైందని చెబుతూ ఆ సిరీస్ కు తప్పించారు. మొన్న జరిగిన సౌతాఫ్రికా వన్డే సిరీస్ ను అయ్యర్ ఆడలేకపోయాడు. ఇప్పటికీ అతనే వైస్ కెప్టెన్ కానీ త్వరలో జరగబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్ లోనూ అయ్యర్ ఆడే అవకాశాలు లేవని తాజా వార్త. బీసీసీఐ ఎక్సలెన్స్ సెంటర్ లో ఫిట్ నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాల్సిన అయ్యర్...ఆ మ్యాచ్ ఫిట్నెస్ ను సాధించలేదని తెలుస్తోంది. పైగా అయ్యర్ విపరీతంగా బరువు తగ్గిపోయాడట. గాయం కారణంగా దాదాపు 8కిలోల బరువును కోల్పోయాడని మ్యాచ్ ఆడే శక్తి తనకు లేదని తెలుస్తోంది. అసలు అయ్యర్ కి ఏమైందనే అంశంపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వట్లేదు కానీ వన్డే వరల్డ్ కప్ లో చోటు కోసం రెండేళ్ల ముందే అంతా టెన్షన్ పడుతుంటే...అయ్యర్ మాత్రం వైస్ కెప్టెన్ గా ఉండి కూడా సిరీస్ ల మీద సిరీస్ లు మిస్సవ్వాల్సిన దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్నాడు. ఐపీఎల్ టైమ్ కి అయినా అయ్యర్ కోలుకోవాలని మునుపటిలా దుమ్మురేపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.





















