Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
టీమిండియా క్రికెట్ కి ఎన్నో అద్భుతమైన సేవలదించిన ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ ముందుంటాడు. టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవటంలో, 2011 వన్డే వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవటంలో స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ది కీలక పాత్ర. రెండు వరల్డ్ కప్పులను భారత్ కి అందించిన హీరోలా చరిత్రలో మిగిలిపోయాడు యువరాజ్. తర్వాత క్యాన్సర్ తో పోరాడి...కెరీర్ లో ఒడిదుడుకులు చూసి రిటైరైనా క్రికెట్ పై తన ప్రేమను మాత్రం వదిలిపెట్ట లేదు యువీ. టీమిండియా టీ20 జట్టుకు ఇప్పుడు తురుపుముక్కలా మారిన అభిషేక్ శర్మ, వన్డే, టెస్టు జట్టులకు కెప్టెన్ గా ఎదిగిన శుభ్ మాన్ గిల్ లాంటి ఆటగాళ్ల కెరీర్ లో యువరాజ్ సింగ్ ది కీలకపాత్ర. వాళ్ల అండర్ 19 టైమ్ నుంచి మెంటార్ గా అండగా నిలిచి నయువరాజ్...అభిషేక్, గిల్ లను టీమిండియా సీనియర్ జట్టులోకి ఎంటర్ అయ్యేలా దగ్గరుండి తనే పర్సనల్ కోచింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అదే యువరాజ్ మరో బాధ్యతను భుజాలకెత్తుకున్నాడు. అదే స్పైడీ రిషభ్ పంత్ కి పర్సనల్ ట్రైనింగ్. గతేడాది ఐపీఎల్ లో ఏకంగా 27కోట్ల ధర పలికి రికార్డు సృష్టించిన రిషభ్ పంత్...స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోయాడు. లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేయటం మినహా పంత్ సాధించింది లేకపోవటంతో LSG జట్టు పంత్ పై తీవ్ర నిరాశలో ఉంది. అందుకే ఇప్పుడు లెఫ్ హ్యాండర్ పంత్ కి సపోర్ట్ గా నిలిచాడు యువరాజ్ సింగ్. టెస్టు, వన్డే జట్టుకు కీపర్ గా రెగ్యులర్ క్రికెట్ ఆడుతున్న పంత్ ను టీ20ల్లోనూ పవర్ ఫుల్ గా మార్చేలా పంత్ టెక్నిక్ పై దృష్టి సారించాడు యువీ. LSG క్యాంప్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చి పంత్ ఆటతీరును పరిశీలించాడు. ఎక్కడ స్పైడీ ఇబ్బంది పడుతున్నాడో గమనించి పలు సూచనలు చేశాడు. LSG జట్టుకు అఫీషియల్ గా ఎలాంటి సేవలను అందించకపోయినా కేవలం పంత్ కోసమే యువీ వచ్చినట్లుగా తెలుస్తోంది. చూడాలి...ఈ ఐపీఎల్ లో పంత్ కూడా సెట్ అయితే యువరాజ్ సింగ్ అనే కోహినూర్ డైమండ్ ప్రభావం టీమిండియాలో కొనసాగుతున్నట్లే.
ట్రెండింగ్ వార్తలు






















