అన్వేషించండి

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!

శ్రీలంకతో జరగబోయే చారిత్రాత్మక 600వ టెస్ట్ మ్యాచ్ లో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవడమే లక్ష్యమని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

IND VS SL Historic Test Match Ambition:  శ్రీలంకతో శనివారం ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇండియా క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని నమోదు చేయనుంది. గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ఇండియాకు 600వ టెస్ట్ కాగా, ఈ చారిత్రక వేదికపై ఇది 50వ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. ఇండియా స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ మ్యాచ్ ప్రారంభం కానుండటం విశేషం. అయితే రికార్డుల కంటే కూడా వచ్చే ఏడాది జూన్ లో ఓవల్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ కు క్వాలిఫై అవ్వడమే తమ మెయిన్ టార్గెట్ అని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఇండియా, ఫైనల్ చేరాలంటే మిగిలిన తొమ్మిది టెస్టుల్లో ఆరు నుంచి ఏడు మ్యాచ్ లు గెలవాల్సి ఉంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ పైనే గురి.. ప్రిపరేషన్స్ పై గిల్ కామెంట్స్
మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో కెప్టెన్ గిల్ మాట్లాడుతూ, "కెప్టెన్ రోల్ లో నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను. గడిచిన ఏడాది కాలంలో టీమ్ పురోగతి సాధిస్తున్న విధానం సంతోషాన్ని ఇస్తోంది. సరైన దిశలోనే అడుగులు వేస్తున్నాం. మా ప్రధాన లక్ష్యం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటమే. ఇందుకోసం మిగిలిన టెస్టుల్లో దాదాపు ఏడు మ్యాచులు గెలవాలి. అందుకే ఈ సిరీస్ మాకు చాలా క్రూషియల్. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కాస్త ఎక్కువ సమయం కావాలి. అందుకే ముందుగానే వచ్చి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాం" అని వివరించాడు.

బుమ్రా లేకపోయినా బౌలింగ్ స్ట్రాంగ్.. ప్రసిద్ధ్ పై ప్రశంసలు
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోయినా జట్టు బౌలింగ్ యూనిట్ పై పూర్తి నమ్మకం ఉందని గిల్ చెప్పాడు. "గుర్నూర్ బ్రార్ మంచి పేస్ తో పాత బాల్ ను బౌన్స్ చేయగలడు. ప్రసిద్ధ్ కృష్ణ రీసెంట్ గా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. గతంలో ఎప్పుడూ లేనంత బెస్ట్ ఫామ్ లో అతడు కనిపించాడు. బుమ్రా లేకపోవడం ఇతర పేసర్లకు తమ సత్తా చాటుకునేందుకు ఒక మంచి అవకాశం. తొలి రెండు రోజుల్లో వికెట్ నుంచి ఎక్కువ సపోర్ట్ లేకపోయినా ఫీల్డింగ్ వ్యూహాలతో ఒత్తిడి పెంచి వికెట్లు తీయాలి" అని పేర్కొన్నాడు.

గాలే మైదానంలో గాలి ప్రభావం.. పడిక్కల్ కు బిగ్ ఛాన్స్
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ గురించి మాట్లాడుతూ, "ఇండియా-ఎ తరఫున పడిక్కల్ ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడికి మంచి నైపుణ్యం ఉంది. గాలే లాంటి ఓపెన్ గ్రౌండ్లలో గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో గ్రౌండ్లు క్లోజ్డ్ గా ఉంటాయి కాబట్టి ఈ తేడాను గమనించాలి. స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు గాలి ఎటు వీస్తుందో చూసుకుని ఆడితే అడ్వాంటేజ్ లభిస్తుంది" అని గిల్ వివరించాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
West Indies Historic Record Chase: 250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
Sandpapergate Secrets Exposed: అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
IND VS WI 2nd T20 Updates: స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget