IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన.. గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అందరి దృష్టి!
శ్రీలంకతో శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో టీమ్ ఇండియా బ్యాటర్లకు స్పిన్ సవాలు ఎదురుకానుంది.

Gautam Gambhir Faces Galle Spin Test: శ్రీలంకతో శనివారం నుంచి ప్రారంభం కాబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో టీమ్ ఇండియా బ్యాటర్లకు కఠినమైన స్పిన్ పరీక్ష ఎదురుకానుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ గెలిచి వైట్ బాల్ లో తిరుగులేని శక్తిగా నిలిచిన ఇండియా, టెస్ట్ క్రికెట్ లో మాత్రం వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో ఉంది. హోమ్ సాయిల్లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాల చేతిలో వైట్‌వాష్ అవ్వడంతో పాటు సపోర్ట్ స్టాఫ్ మార్పుల తర్వాత జరుగుతున్న ఈ సిరీస్ గంభీర్ రెడ్ బాల్ కోచింగ్ ఫ్యూచర్ కు చాలా క్రూషియల్ గా మారింది.
🔥 𝗦𝗟 𝗩𝗦 𝗜𝗡𝗗 — 𝗣𝗥𝗢𝗕𝗔𝗕𝗟𝗘 𝗫𝗜! 🇮🇳🏏
— IceCricNews (@icecric_news) August 14, 2026
1st Test Match
The Galle battle is almost here! 👀🔥#INDvsSL #ProbableXI #TeamIndia #TestCricket #ShubmanGill #YashasviJaiswal #KLRahul #RishabhPant #ICECricNews #CricketOnICE pic.twitter.com/V0xBvUNz5T
గాలే మైదానంలో స్పిన్ రికార్డు.. లంక స్పిన్నర్ల డేంజర్
గాలే వేదిక విదేశీ జట్లకు ఎప్పుడూ ఒక పీడకల లాంటిదే. 1998 నుంచి ఇక్కడ జరిగిన 49 టెస్టుల్లో శ్రీలంక ఏకంగా 27 మ్యాచ్ లు గెలిచింది. ముత్తయ్య మురళీధరన్, రంగన హెరాత్ ల శకం ముగిసినా, ప్రస్తుతం ప్రభాత్ జయసూర్య, రమేష్ మెండిస్ లు గాలే ను తమ కోటగా మార్చుకున్నారు. గతంలో మిచెల్ సాంట్నర్, సైమన్ హార్మర్ ల స్పిన్ బౌలింగ్ లో తడబడిన ఇండియన్ బ్యాటర్లకు ఇది బిగ్ ఛాలెంజ్. 2017 లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో లంకను 3-0 తో ఓడించిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీమ్ ఈసారి కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.
IND vs SL Test series starts tomorrow 🔥
— Paras (@parasVK) August 14, 2026
Most Test wins in SL by Indian captains
5 - Virat Kohli (6 matches)
1 - MS Dhoni (3)
1 - Sourav Ganguly (3)
1 - Anil Kumble (3)
1 - Azharuddin (4)
0 - Sachin Tendulkar (2)
0 - Kapil Dev (3) pic.twitter.com/z3Z3mLSTMe
పంత్, జురెల్ బ్యాటింగ్ ఫామ్.. నంబర్ 3 రేసులో పడిక్కల్
మిడిల్ ఆర్డర్ లో రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ ల బ్యాటింగ్ ఫామ్ ఈ మ్యాచ్ లో కీలకం కానుంది. సర్ఫరాజ్ ఖాన్ కంటే ముందు జురెల్ కు తుది జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. టాప్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ లతో పాటు కెప్టెన్ గిల్ భారీ స్కోర్లు చేయాల్సి ఉంటుంది. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో నంబర్ 3 లో బరిలోకి దిగనున్న దేవదత్ పడిక్కల్ కు తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ.
ముగ్గురు స్పిన్నర్లతో ఇండియా ఎటాక్.. ఉదయం 10 గంటలకు మ్యాచ్ స్టార్ట్
ఇండియా ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ లతో రంగంలోకి దిగనుంది. పేస్ డిపార్ట్‌మెంట్ లో సీనియర్ మహమ్మద్ సిరాజ్ కు తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మరోవైపు ధనంజయ డి సిల్వా కెప్టెన్సీ లోని లంక జట్టు మ్యాచ్ ప్రాక్టీస్ తక్కువగా ఉన్నా స్వదేశీ పరిస్థితుల్లో బలంగా ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానుంది.
Before You Go
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
ట్రెండింగ్ వార్తలు



















