విజయనగరం జిల్లాలో రవాణా సౌకర్యం లేని దుస్థితి మరోసారి కంటతడి పెట్టించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన 12 ఏళ్ల కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం, వాహన సదుపాయం లేకపోవడంతో ఓ తల్లి అంబులెన్స్‌గా మారింది. బిడ్డను భుజాలపై ఎత్తుకుని దాదాపు 7 కిలోమీటర్లు కొండ దారిలో నడుచుకుంటూ కిందకు చేరుకుని ఆసుపత్రికి తరలించింది.