Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవరంటే..!
హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా జెమిమా రోడ్రిగ్స్ రాబోయే ఉమెన్స్ ఆసియా కప్, ఏషియన్ గేమ్స్ నుంచి తప్పుకోగా ప్రతీక రావల్ రీప్లేస్‌మెంట్ గా వచ్చింది.

Jemimah Misses Key Events: ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ ఇంజ్యూరీ కారణంగా రాబోయే రెండు బిగ్ టోర్నమెంట్లకు దూరమైంది. ఇంగ్లాండ్ లో జరిగిన 'ద హండ్రెడ్' లీగ్ లో ఆడుతున్న సమయంలో హామ్‌స్ట్రింగ్ గాయం వల్ల ఆమె రాబోయే ఉమెన్స్ ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ నుంచి కంప్లీట్ గా రూల్ అవుట్ అయింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (సీఓఈ) మెడికల్ టీమ్ ఆమెను పరిశీలించి, గాయం తీవ్రత ఎక్కువ ఉండటంతో రెస్ట్ అవసరమని తెలిపినట్లు బిసిసిఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.
India batter Jemimah Rodrigues suffered a hamstring injury on 3 August while playing for Southern Brave in The Hundred in England and has now been ruled out of India's upcoming assignments in the Women's Asia Cup in the UAE as well as the Asian Games in Japan.
— United News of India (@uniindianews) August 14, 2026
The extent of the… pic.twitter.com/cnEEfhMTCU
ఆగస్టు 3న గాయం.. మెడికల్ టెస్టుల్లో హై-గ్రేడ్ టియర్
"ఆగస్టు 3న ఇంగ్లాండ్ లో 'ద హండ్రెడ్' మ్యాచ్ ఆడుతుండగా జెమిమా కుడి తొడ కండరాల గాయానికి గురైంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో బిసిసిఐ మెడికల్ టీమ్ ఆమెకు క్లినికల్ టెస్టులు నిర్వహించింది. ఈ టెస్టుల్లో ఆమెకు హై-గ్రేడ్ టియర్ ఉన్నట్లు తేలింది" అని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. దాంతో యూఏఈ వేదికగా జరగబోయే ఆసియా కప్, జపాన్ లో జరగబోయే ఏషియన్ గేమ్స్ కు జెమిమా దూరమవ్వక తప్పలేదు.
🚨 BREAKING 🚨
— Cricket Impluse (@cricketimpluse) August 14, 2026
Jemimah Rodrigues has been ruled out of the Asia Cup and Asian Games due to a right hamstring injury sustained during The Hundred. Wishing her a speedy recovery! 🇮🇳💙
Pratika Rawal will replace her. 👍#JemimahRodrigues #TeamIndia #PratikaRawal pic.twitter.com/2zHst17iOk
ప్రతీక రావల్ కు లక్కీ ఛాన్స్.. దుబాయ్ లో ఆసియా కప్ సమరం
25 ఏళ్ల జెమిమా స్థానంలో ప్రతీక రావల్ ను ఉమెన్స్ సెలెక్షన్ కమిటీ రీప్లేస్‌మెంట్ గా ఎంపిక చేసింది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు దుబాయ్ వేదికగా ఏసీసీ ఉమెన్స్ ఆసియా కప్ జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ లోని ఐచి-నగోయా వేదికగా ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. కీలకమైన ఈ రెండు టోర్నీలకు ముందు స్టార్ బ్యాటర్ దూరం కావడం భారత జట్టుకు బిగ్ షాక్ అనే చెప్పాలి.
ఉమెన్స్ ఆసియా కప్ అప్‌డేటెడ్ ఇండియన్ స్క్వాడ్..
జెమిమా రోడ్రిగ్స్ స్థానంలో ప్రతీక రావల్ ఎంట్రీతో బిసిసిఐ అప్‌డేటెడ్ స్క్వాడ్ ను రిలీజ్ చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా టీమ్ ను లీడ్ చేయనున్నారు. జట్టులో షెఫాలీ వర్మ, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, ప్రేమ రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్, ప్రతీక రావల్ ఉన్నారు.
Before You Go
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
ట్రెండింగ్ వార్తలు



















