వెంకటేష్ 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి' పాత్రలో నటిస్తున్నారు. ఆయన కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడిగా కనిపించనున్నారు.
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Venkatesh First Look: వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతున్న తాజా సినిమా నుంచి లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

- వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రయాణంలో కల్నల్ వెంకట్ రెడ్డిగా ఫస్ట్ లుక్.
- ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ గా వెంకటేష్ పవర్ ఫుల్ పాత్ర.
- కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్ నిపుణుడిగా వెంకటేష్ కనిపించనున్నారు.
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రం 2027 సంక్రాంతికి విడుదల.
విక్టరీ వెంకటేష్ (Venkatesh), బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. ఇప్పుడు వాళ్ళిద్దరి కలయికలో ఐదో సినిమా తెరకెక్కుతోంది. అందులో నందమూరి కళ్యాణ్ రామ్ మరొక హీరో. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పుడు వెంకటేష్ లుక్ విడుదల చేశారు.
ఇండస్ట్రీలో 40 ఏళ్ళ ప్రయాణం...
కల్నల్ వెంకట్ రెడ్డిగా ఫస్ట్ లుక్ రిలీజ్
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ ప్రయాణం ప్రారంభమై 40 ఏళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Also Read: Jo Jo Movie - దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో వెంకటేష్ నటిస్తున్నట్టు తెలిపారు. ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్‌లో సన్ గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి పవర్ ఫుల్ అవతార్‌లో కనిపించారు వెంకీ. రగ్గడ్ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారనే విషయం తెలుస్తోంది. కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో ఎక్స్‌పర్ట్‌గా కనిపించనున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. అలాగే, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా. వచ్చే ఏడాది సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
Also Read: Vishal Makutam Review In Telugu - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
View this post on Instagram
వెంకటేష్ సరసన కీర్తి సురేష్... కళ్యాణ్ రామ్ జోడీగా కృతి శెట్టి నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, ఎడిటర్: తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. కృష్ణ.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Frequently Asked Questions
కొత్త సినిమాలో వెంకటేష్ పాత్ర ఏమిటి?
ఈ సినిమాలో ప్రధాన హీరోలు ఎవరు?
ఈ సినిమాలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన హీరోలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు?
బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వెంకటేష్, అనిల్ రావిపూడిల ఐదవ కలయిక.
ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది?
ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రెండింగ్ వార్తలు






















