అన్వేషించండి

Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'

Deva Katta Jo Jo Movie: ప్రముఖ దర్శకుడు దేవ కట్టా సమర్పణలో కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ సినిమాకు 'జో జో' టైటిల్ ఖరారు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కిరణ్ జయ్ కుమార్ 'జో జో'తో దర్శకుడిగా వెండితెరకు పరిచయం.
  • దేవ కట్ట సమర్పణలో ఇది భిన్నమైన రొమాంటిక్ కామెడీ చిత్రం.
  • వజ్రాల కోసం యువతీ యువకులు చేసే సాహసోపేత అన్వేషణ.
  • ప్రేమ, మోసం, హాస్యం కలగలిసిన ఆసక్తికర ప్రయాణ కథాంశం.

Kiran Jay Kumar Debuts With Jo Jo Movie: దర్శకుడిగా పరిచయమైన 'ప్రస్థానం' నుంచి 'మయసభ' వెబ్ సిరీస్ వరకు... దేవ కట్టా ఆలోచింపజేసే సీరియస్ కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన పంథాకు భిన్నమైన జోనర్ రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ చేశారు. అయితే ఆ సినిమాకు ఆయన దర్శకుడు కాదు... కేవలం సమర్పకులు మాత్రమే.

కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వంలో 'జో జో'
'మయసభ'కు దేవ కట్టా (Deva Katta)తో పాటు దర్శకత్వం వహించిన కిరణ్ జయ్ కుమార్ (Director Kiran Jay Kumar) ఇప్పుడు వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జొన్నగిరిలోని అల్ట్రా రూరల్ డైమండ్ ఫీల్డ్స్‌ నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతోంది. రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ సినిమాకు 'జో జో' టైటిల్ ఖరారు చేశారు. ప్రేమ, జీవితంపై ఆశ‌లు, జీవితంలో పైకి ఎదగాలనే తపన, మెరుగైన జీవితం కోసం మనుషులు ఎంత దూరమైన ప్రయాణించే తీరును సెటైరికల్ కామెడీతో 'జో జో'లో చూపించనున్నారు.

Also ReadVishal Makutam Review In Telugu - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

ఎండిపోయిన జొన్నగిరి డైమండ్ ఫీల్డ్స్‌లో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి తమ జీవితాలను మార్చేసే శక్తి ఉన్న వజ్రం కోసం అన్వేషణ మొదలు పెడతారు. ఒక్క వజ్రం దొరికితే తమ కష్టాలన్నీ తీరిపోతాయని, తమ జీవితాలు మారిపోతాయని ఆశ పడతారు. అయితే వాళ్ళ అన్వేషణ అంత సులభంగా సాగదు. ప్రేమ, వినోదం, అత్యాశ, మోసం, ప్రమాదాలు... ఊహించని పరిణామాలతో ఆ యువతీ యువకుల వజ్రాల అన్వేషణ, ఆ ప్రయాణం గందరగోళంగా మారుతుంది. ఆ నేపథ్యంలో 'జో జో'ను భిన్నమైన నేటివిటీతో రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.

Also ReadVishwanath And Sons Review - విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ: సూర్య సినిమా హిట్టా? ఫట్టా? వెంకీ అట్లూరి ఎలా తీశారంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deva Katta (@filmdeva)

'జో జో' టైటిల్ పోస్టర్ చూస్తే... రా అండ్ ఎర్తీ నేచర్‌ ఆవిష్కరించేలా జొన్నగిరి ల్యాండ్‌ స్కేప్‌ చూపిస్తూ ప్రధాన పాత్రలను హైలైట్ చేశారు. ''హెచ్చరిక: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి!'' అంటూ సరదాగా వార్నింగ్‌ ఇచ్చారు. 'జో జో' చిత్రాన్ని విజయం పతాకంపై విజయ్ కృష్ణ లింగమనేని నిర్మిస్తున్నారు. కిరణ్ జయ్ కుమార్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కృష్ణ క‌మ‌ల్‌, మాహి శ్రీ, ఫ‌ణీంద్ర దేవ‌ర‌ప‌ల్లి, ప్ర‌భావ‌తి, మ‌హ‌బూబ్ బాషా, స‌తీష్ దేవ‌ట్టే తంజోర్‌, పూడూరు శ‌ర‌త్ బాబు, మ‌క‌రంద్ దేశ్‌పాండే త‌దిత‌రులు నటించిన ఈ సినిమాకు స‌మ‌ర్పణ‌:  దేవ క‌ట్టా, సినిమాటోగ్రఫీ: రోహిత్ కుమార్‌, సంగీతం: మ‌హేష్ శంక‌ర్‌, కూర్పు: మాధ‌వ్ కుమార్ గుళ్ళప‌ల్లి, పాట‌లు: రెహ‌మాన్‌ - శ్రీనివాస్ మౌళి - రామ‌చంద్ర.

Also Read: Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?

Frequently Asked Questions

'జో జో' సినిమా దర్శకుడు ఎవరు?

'జో జో' సినిమాతో కిరణ్ జయ్ కుమార్ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. గతంలో ఆయన దేవ కట్టాతో కలిసి 'మయసభ' వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

'జో జో' చిత్రంలో దేవ కట్టా పాత్ర ఏమిటి?

దేవ కట్టా ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆయన సాధారణంగా చేసే సీరియస్ కథల పంథాకు భిన్నంగా రొమాంటిక్ కామెడీ జానర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

'జో జో' సినిమా నేపథ్యం, జానర్ ఏమిటి?

ఈ సినిమా జొన్నగిరిలోని అల్ట్రా రూరల్ డైమండ్ ఫీల్డ్స్ నేపథ్యంలో రూపొందింది. ఇది రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ జానర్ చిత్రంగా తెరకెక్కుతోంది.

'జో జో' చిత్రంలో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించారు?

ప్రేమ, ఆశలు, జీవితంలో పైకి ఎదగాలనే తపనతో పాటు, మెరుగైన జీవితం కోసం మనుషులు చేసే ప్రయాణాన్ని సెటైరికల్ కామెడీతో ఈ చిత్రంలో చూపించనున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget