వెంకటేష్ 75వ సినిమా 'సైంధవ్' రివ్యూస్ బాలేదు. సినిమాలో ప్లస్, మైనస్ & హైలైట్స్ ఏంటో చూడండి.

కథ: సైంధవ్ కోనేరు (వెంకటేష్) పోర్టులో ఉద్యోగి. అమ్మాయి గాయత్రికి అరుదైన వ్యాధి బారిన పడుతుంది.

పాపకు రూ. 17 కోట్ల ఇంజెక్షన్ అవసరం. సైంధవ్ డబ్బు కోసం టెన్షన్‌లో ఉంటే... చంద్రప్రస్థలో భారీ డీల్ జరుగుతుంది.

పోర్టులో పట్టుబడిన డ్రగ్స్, గన్స్, ఫేక్ కరెన్సీని సైంధవ్ దాస్తాడు. దాంతో అతడిని వికాస్ (నవాజుద్దీన్) టార్గెట్ చేస్తాడు.

ఒకప్పుడు మాఫియాలో పని చేసిన సైంధవ్... తర్వాత ఎందుకు మానేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? అనేది కథ. 

విశ్లేషణ: హాలీవుడ్ హిట్ 'జాన్ విక్' స్ఫూర్తితో శైలేష్ కొలను రాసిన కథలో విషయం ఉంది. కానీ, ఎగ్జిక్యూషన్ దెబ్బ తింది.

సైంధవ్ కోనేరుగా వెంకటేష్ క్యారెక్టరైజేషన్ బాగా రాసిన శైలేష్... మిగతా క్యారెక్టర్లు, సీన్లు సరిగ్గా రాయలేదు. తీయలేదు.

ఫైట్స్ బావున్నా... రీ రికార్డింగ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయలేదు. నేరేషన్ ఫ్లాట్‌గా ఉంది. ఎగ్జైట్ చేయలేదు.

వెంకటేష్, నవాజుద్దీన్ బాగా చేశారు. ఆర్య అతిథిలా కనిపించారు. మిగతా వాళ్లకు సరైన క్యారెక్టర్లు పడలేదు.

వెంకటేష్, నవాజుద్దీన్ నటన, ఫైట్స్ ప్లస్ అయితే... శైలేష్ డైరెక్షన్ మైనస్. ఇది డిజప్పాయింట్ చేసే సినిమా.