'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్, త్రివిక్రమ్ చేసిన హ్యాట్రిక్ ఫిల్మ్ 'గుంటూరు కారం'. ఇందులో ప్లస్, మైనస్‌లు మినీ రివ్యూలో చూద్దాం. కథ: సత్యం (జయరామ్), వసుంధర (రమ్యకృష్ణ) కొడుకు రమణ (మహేష్). 10 ఏళ్లకు తల్లి వదిలేసి వెళుతుంది. భర్తకు విడాకులు ఇస్తుంది. ఆమెకు మరో పెళ్లి చేసి... ఎమ్మెల్యే & మంత్రిని చేస్తాడు తండ్రి (ప్రకాష్ రాజ్). వసుంధర రాజకీయాలకు రమణ అడ్డొస్తాడని అతడిని పిలిచి తల్లితో తనకు సంబంధం లేదని పేపర్స్‌పై సంతకం చేయమంటారు. తొలుత 'నో' చెప్పిన రమణ, తర్వాత సైన్ చేస్తాడు. కొడుకును తల్లి ఎందుకు వదిలేసింది? చివరకు ఏమైంది? అనేది సినిమా. విశ్లేషణ: సినిమా మొదలైన పావుగంటకు బోర్ కొడుతుంది. మధ్యలో మెరుపులు తప్పిస్తే ఏ దశలోనూ ఆకట్టుకోదు. సినిమాకు మెయిన్ ప్రాబ్లమ్ కథ, సన్నివేశాలు కొత్తగా లేవు. త్రివిక్రమ్ రాసిన కథేనా అని ఓ దశలో సందేహం కలుగుతుంది. అల వైకుంఠమురములో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఛాయలు 'గుంటూరు కారం'లో కనిపిస్తాయి. తమన్ పాటలు, నేపథ్య సంగీతం అసలు ఆకట్టుకోలేదు. టెక్నికల్‌గానూ సినిమా వీక్. ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. మహేష్ బాబు ఎనర్జీ, డ్యాన్స్ సూపర్. ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్. శ్రీలీల డ్యాన్స్ ఇరగదీశారు. మిగతా ఆర్టిస్టులు తమ పరిధి మేరకు చేశారు. మహేష్ బాబు హార్డ్ కోర్, డై హార్డ్ ఫ్యాన్స్‌ను కూడా డిజప్పాయింట్ చేసే సినిమా 'గుంటూరు కారం'