'యానిమల్'కు తెలుగులో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ సినిమా హిట్టా? ఫట్టా? ప్లస్, మైనస్‌లు ఏంటి?

కథ: బల్బీర్ (అనిల్ కపూర్) స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్. రణ్ విజయ్ సింగ్ (రణబీర్) అతని కొడుకు.

కొడుక్కి తండ్రి అంటే పిచ్చి ప్రేమ. ఫ్యాక్టరీ పనుల్లో పడి కొడుకును తండ్రి నిర్లక్ష్యం చేస్తాడు. 

తండ్రితో గొడవ కావడంతో ప్రేమించి పెళ్లాడిన గీతాంజలి (రష్మిక)తో కొడుకు అమెరికా వెళతాడు.

బల్బీర్ మీద ఎటాక్ జరగడంతో రణ్ విజయ్ ఇండియా వస్తాడు. ఎటాక్ ఎవరు చేశారు? వాళ్ళను విజయ్ ఏం చేశాడు?

ఎలా ఉంది?: సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ & ఎమోషనల్ ఫిల్మ్ 'యానిమల్'. అందులో మరో డౌట్ లేదు.

రణబీర్ కపూర్ ప్రాణం పెట్టి నటించారు. కొన్ని సీన్లలో ఆయన్ను చూస్తే భయం వేస్తుంది. 'యానిమల్'గా మరొకర్ని ఊహించుకోలేం. 

'యానిమల్' స్టార్టింగ్ నుంచి హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేస్తూ వచ్చారు సందీప్. ఆయన మార్క్ సీన్స్ హై ఇస్తాయి.

ఇంటర్వెల్‌కు క్లైమాక్స్ ఫీల్ ఇచ్చారు సందీప్, రణబీర్! తర్వాత ఎమోషన్ ఎక్కువ డ్రైవ్ కావడంతో లెంగ్తీ ఫీల్ వస్తుంది. 

రణబీర్ నటన, సందీప్ డైరెక్షన్, హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం కోసమైనా తప్పకుండా 'యానిమల్' చూడాలి.

Thanks for Reading. UP NEXT

కోటబొమ్మాళి పీఎస్ మినీ రివ్యూ: సినిమాలో ప్లస్, మైనస్‌లు ఏంటి?

View next story