మలయాళ హిట్ 'నాయట్టు'కు తెలుగు రీమేక్ 'కోట బొమ్మాళీ పీఎస్'. ఇందులో ప్లస్, మైనస్, హైలైట్స్ ఏంటి?

కథ: మర్డర్ కేసులో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ (శ్రీకాంత్), కానిస్టేబుల్స్ రవి (రాహుల్ విజయ్), కుమారి (శివాని) ఇరుక్కుంటారు.

టెక్కలి ఉప ఎన్నికలో ఓ కులం ఓట్ల కోసం వాళ్ళను బలిపశువులు చేసే ప్లాన్ వేస్తాడు హోమ్ మంత్రి (మురళీ శర్మ)

ముగ్గుర్నీ పట్టుకోవడానికి ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్ కుమార్)ను రంగంలోకి దించుతారు.

రామకృష్ణను రజియా అలీ పట్టుకుందా? లేదా? ఎంకౌంటర్స్ కేసు డైరీ రాసిన అనుభవంతో రామకృష్ణ ఏం చేశాడు? అనేది సినిమా.

ఎలా ఉంది? 'నాయట్టు'ను ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయకుండా కథ, కథనంలో కాస్త మార్పులు చేశారు దర్శకుడు తేజా మార్ని.

'నాయట్టు' చూసిన వాళ్ళకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. చూడని వాళ్ళను 'కోట బొమ్మాళి పీఎస్' నచ్చుతుంది.

శ్రీకాంత్, వరలక్ష్మీతో పాటు మిగతా ఆర్టిస్టులు సహజంగా చేశారు. నేపథ్య సంగీతం బావుంది.

ఎత్తుకు పైఎత్తు వేస్తూ శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య ఆటను బాగా తీశాడు. ఫస్టాఫ్ రేసీగా ఉంటే... సెకండాఫ్ స్లో అయ్యింది.

'కోట బొమ్మాళి పీఎస్' మంచి థ్రిల్ ఇస్తుంది. చివరలో ఓట్లు, నోట్లు, జనాలు అంటూ చెప్పే మాటలు ఆలోచన రేకెత్తిస్తాయి.

Thanks for Reading. UP NEXT

ఆదికేశవ మినీ రివ్యూ: సినిమా ఫ్లాప్‌కు రీజన్స్ ఏంటి?

View next story