కార్తీ 25వ సినిమా 'జపాన్'లో ప్లస్, మైనస్ పాయింట్స్ & ఫ్లాప్ టాక్ వెనుక రీజన్స్ ఏంటో మినీ రివ్యూలో చూడండి. కథ : ఓ జ్యువెలరీ షాపులో 200 కోట్ల విలువైన నగలు జపాన్ ముని (కార్తీ) దొంగతనం చేశాడని పోలీసుల అనుమానం. జపాన్‌ను పట్టుకోవడానికి శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్) ప్రయత్నాలు చేస్తున్నారు. తాను ఆ దొంగతనం చేయలేదని జపాన్ చెబుతాడు. అతడి స్టైల్‌లో రాబరీ చేసింది ఎవరు? జపాన్ నేపథ్యం ఏమిటి? సంజు (అనూ ఇమ్మాన్యుయేల్)తో సంబంధం ఏమిటి? ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా. ఎలా ఉంది? : 'జపాన్' సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది కార్తీ మాత్రమే! జపాన్ పాత్రకు కార్తీ న్యాయం చేశారు. కొత్త డైలాగ్ డెలివరీ & డ్రసింగ్ స్టైల్ ట్రై చేశారు. నటనలో, అందాల ప్రదర్శనలో హీరోయిన్ అను ఫెయిల్ అయ్యింది. సునీల్ బాగా చేశారు. మిగతా క్యారెక్టర్లు ఓకే. దర్శకుడు కామెడీ అనుకుని తీసిన సీన్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే అసలు బాలేదు. కొన్ని కామెడీ సీన్స్ తప్ప 'జపాన్'లో ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ ఏమీ లేవు. స్టార్ట్ టు ఎండ్ బోర్ కొట్టించింది.