రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? సినిమా ఎలా ఉందనేది చూస్తే... కథ : స్టూవర్టుపురంలో పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసులో నాగేశ్వరరావు (రవితేజ) దొంగగా మారతాడు. తండ్రిని చంపిన నాగేశ్వరరావు కాలక్రమంలో ప్రధానికి సవాల్ విసిరే స్థాయికి ఎలా వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? నాగేశ్వరరావు నుంచి 'టైగర్'గా ఎలా మారాడు? దోచుకున్న డబ్బును ఫ్యామిలీకి ఇవ్వకుండా ఏం చేశాడు? అనేది సినిమాలో చూడాలి. ఎలా ఉంది? : 'టైగర్' రోలర్ కోస్టర్ ఫీలింగ్ ఇస్తుంది. కొంత పాజిటివ్, నెగిటివ్... సోసోగా ఉంటుంది. ఆకలి మీదున్న పులిలా రవితేజ సింహగర్జన చేశారు. తన పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. 'టైగర్' ప్రారంభం, రవితేజ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ తర్వాత సినిమాపై ఆసక్తి కలిగిస్తాయి. దొంగతనం సీన్లు ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయో... లవ్ స్టోరీ, సెకండాఫ్ అంత బోర్ కొట్టించాయి. నిడివి ఎక్కువ అయ్యింది. ఇంటర్వెల్ తర్వాత టైగర్ మంచోడు అంటూ కథ అప్పటివరకు చూసిన కథను కొత్తగా చెప్పడం మొదలు పెట్టారు. దాంతో రిపీట్ అయినట్టుంది. పాటలు, నేపథ్య సంగీతం 'టైగర్'కు పెద్ద మైనస్. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాలేదు. ప్రొడక్షన్ సోసోగా ఉంది. రవితేజ తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నా... సినిమాను భరించడం కష్టమే.