విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల తీసిన 'పెదకాపు 1'లో ప్లస్, మైనస్ పాయింట్స్, హైలైట్స్ ఏంటి?

కథ : గోదావరి లంక గ్రామాల్లో అణగారిన వర్గాల్లోని ఓ యువకుడు 'పెదకాపు' (విరాట్ కర్ణ).

ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తరుణంలో పెదకాపు యజమాని సత్య రంగయ్య (రావు రమేష్) టికెట్ ఆశిస్తాడు.

అయితే... ఎమ్మెల్యే అభ్యర్థిగా పెదకాపు పేరు ప్రకటిస్తారని తెలుస్తుంది. అప్పుడు ఏం జరిగింది?

లంక గ్రామాల్లో అక్కమ్మ (అనసూయ) చేసిన రాజకీయం ఏమిటి? బయన్న (ఆడుకాలం నరేన్) ఎవరు? అనేది సినిమా.

ఎలా ఉంది? : శ్రీకాంత్ అడ్డాల నిజాయతీగా సినిమా తీశారు. కానీ, సాగదీశారు. నిడివి ఇంకా తగ్గించాల్సింది.

'పెదకాపు 1'లో కథ కొత్తది ఏమీ కాదు. కథనం బావుంది కానీ ఓ పంచ్ మిస్ అయ్యింది.

ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు వెన్నుదన్నుగా నిలిచాయి.

సినిమాలో మాస్ & హై మూమెంట్స్ బావున్నాయి. అయితే రోలర్ కోస్టర్ రైడ్ తరహాలో అప్ & డౌన్స్ ఉన్నాయి.

రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ స్లోగా ఉన్నా సరే ఎంజాయ్ చేసే ప్రేక్షకులు 'పెదకాపు 1'కు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు.

Thanks for Reading. UP NEXT

‘చంద్రముఖి 2’ మినీ రివ్యూ: రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?

View next story