రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్‌ల 'సప్త సాగరాలు దాటి' కన్నడలో హిట్. తెలుగులో రిలీజ్ చేశారు. ఇందులో ప్లస్, మైనస్‌లు ఏంటి?

కథ : మను (రక్షిత్ శెట్టి) డ్రైవర్, ప్రియా (రుక్మిణీ వసంత్) సింగర్. ఇద్దరూ ప్రేమలో పడతారు. పెళ్లికి రెడీ అవుతారు.

డబ్బు ఆశ చూపడంతో ఓనర్ కొడుకు చేసిన యాక్సిడెంట్ తన మీద వేసుకుని జైలుకు వెళతాడు మను.

జైలులో మను, బయట ప్రియా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? చివరికి ఏమైంది? అనేది సినిమా.

ఎలా ఉంది? : 'సప్త సాగరాలు దాటి' సంగీత భరిత ప్రేమకథా చిత్రమని చెప్పాలి. ఇదొక మ్యూజికల్ పోయెట్రీ.

కథగా చూస్తే సినిమాలో కొత్తదనం లేదు. ఇద్దరు ప్రేమికులకు ఎదురైన పరిస్థితులే ప్రధాన కథాంశం.

సినిమాపై మరో ప్రధాన విమర్శ... నిదానం! డెప్త్ ఎక్కువ కావడంతో చాలా సీన్స్ స్లో అనే ఫీలింగ్ కలుగుతుంది.

సాధారణ ప్రేమ సన్నివేశాలకు తమ నటనతో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రాణం పోశారు.

రక్షిత్, రుక్మిణి నటనకు చరణ్ రాజ్ అద్భుతమైన పాటలు, సంగీతం తోడవడంతో సీన్స్ స్వరూపమే మారింది.

ఇంటెన్స్ లవ్ స్టోరీలు నచ్చేవాళ్లకు బెస్ట్ ఆప్షన్ 'సప్త సాగరాలు దాటి'. క్లైమాక్స్ సెకండ్ పార్ట్ మీద హైప్ పెంచింది.