అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? మినీ రివ్యూలో చూడండి. కథ : అన్విత (అనుష్క) పెళ్లి కాకుండా కృత్రిమ గర్భదారణ ద్వారా ఓ బిడ్డకు జన్మ ఇవ్వాలని అనుకుంటుంది. బిడ్డలో ఉండాల్సిన లక్షణాలు నిర్ణయించి స్పెర్మ్ డోనర్ అన్వేషణ మొదలు పెడితే సిద్ధూ (నవీన్ పోలిశెట్టి) సరైన వ్యక్తిగా అనిపిస్తాడు. అన్విత దగ్గరైతే ప్రేమని సిద్ధూ ఫీలవుతాడు. అసలు విషయం తెలిశాక ఏం చేశాడు? ఏమైంది? అనేది సినిమా. ఎలా ఉంది? : 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కథ కొత్తది. కానీ, కథనం పాత వాసనలు కొడుతుంది. సినిమా ప్రారంభంతో పాటు తల్లితో హీరోయిన్, తండ్రితో హీరో ట్రాక్ రొటీన్‌గా ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి ఎంటయ్యాక వేగం, కామెడీ... రెండూ పెరిగాయి. స్టాండప్ కామెడీతో నవీన్ ఎంటర్టైన్ చేశారు. కొత్త పాయింట్, సిట్యువేషనల్ కామెడీతో దర్శకుడు మహేష్ చక్కటి సీన్లు రాశారు. గీత దాటలేదు. అనుష్క, నవీన్... ఇద్దరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్‌లో కంటతడి పెట్టిస్తారు. కామెడీతో పాటు మంచి ఎమోషనల్ ఫీల్ ఉన్న సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. డోంట్ మిస్ ఇట్!