వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారుల 'గాండీవదారి అర్జున'కు ఫ్లాప్ టాక్ వచ్చింది. రీజన్స్ ఏంటి? కథేంటి?

కథ : అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) హై రిస్క్ టార్గెట్ ఉన్న వ్యక్తులకు సెక్యూరిటీ ఇచ్చే ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాడు.

కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ (నాజర్) మీద ఎటాక్స్ జరగడంతో ఆయనకు సెక్యూరిటీగా అర్జున్ వర్మ వెళతాడు. 

లండన్‌లో ఆదిత్య రాజ్ మీద ఎటాక్స్‌కు కారణమైన రణ్‌వీర్ (వినయ్ రాయ్) ఎవరు?

ఆదిత్య రాజ్, రణ్‌వీర్, ఇండియాలో అంతుచిక్కని రోగాలకు సంబంధం ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.

ఎలా ఉంది? : దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ నేపథ్యంలో మంచి సందేశంతో కూడిన కథ చెప్పాలని అనుకున్నారు. 

కథలో సందేశం ఉంది గానీ కొత్తదనం లేదు. ఆల్రెడీ 'సింగం 3'లో చూసిన పాయింటే అది. 

ప్రవీణ్ సత్తారు రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్... ఏదీ సినిమాలో ఇన్వాల్వ్ చేసేలా లేదు. హీరో హీరోయిన్స్ ట్రాక్ బాలేదు. 

వరుణ్ తేజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. కానీ, ఓవరాల్ సినిమా చూస్తే ఇంపాక్ట్ ఏమీ లేదు.

హాలీవుడ్ స్టైల్ యాక్షన్ తీయాలని అనుకోవడం మంచిదే. కానీ, ఎంగేజ్ చేసేలా యాక్షన్ & ఎమోషన్స్ లేవు.