'భోళా శంకర్'కు నెగిటివ్ రివ్యూలు ఎక్కువ వచ్చాయి. అసలు, చిరు సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? కథ : శంకర్ (చిరంజీవి) క్యాబ్ డ్రైవర్. అతని చెల్లెలు మహాలక్ష్మి (కీర్తీ సురేష్)తో కలిసి కలకత్తా వెళతాడు. కలకత్తాలో అమ్మాయిలను కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేసే ముఠాకు... మహాలక్ష్మి, శంకర్‌కు సంబంధం ఏమిటి? హైదరాబాద్‌లో 'భోళా'గా పేరు గాంచిన రౌడీ, కలకత్తాకు శంకర్‌గా ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఏం చేశాడు? అనేది సినిమా. ఎలా ఉంది? : 'భోళా శంకర్'లో కొత్త అంశాలు లేవు. పాత కథను అంతే నాసిరకంగా తీశారు దర్శకుడు మెహర్ రమేష్. సినిమాకు మ్యూజిక్ పెద్ద మైనస్. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ నుంచి సరైన అవుట్ పుట్ తీసుకోలేదు మెహర్ రమేష్. 'భోళా శంకర్'లో ఇంటర్వెల్ వరకు కామెడీ, ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ ఏమీ లేవు. రోత పుట్టించే రొట్ట రొటీన్ సీన్లు తప్ప! చిరంజీవి ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. సరైన సీన్లు లేకపోవడంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. నటనలో కీర్తీ సురేష్ మెరిస్తే... తమన్నా గ్లామర్ షో చేశారు. మిగతా ఆర్టిస్టులకు సరైన సీన్లు, కామెడీ సీన్లు అసలు లేవు. అవుట్ డేటెడ్ రొటీన్ కమర్షియల్ సినిమా భోళా శంకర్. చిరు ఛాన్స్ వేస్ట్ చేసుకున్న మెహర్... బాగా డిజప్పాయింట్ చేశారు.