'జైలర్'తో రజనీకాంత్ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్. మరి, సినిమా ఎలా ఉంది? మినీ రివ్యూ చదవండి.

కథ : ముత్తు (రజనీకాంత్) రిటైర్డ్ జైలర్. వాళ్ళబ్బాయి అర్జున్ (వసంత్ రవి) ఏసీపీ. ఓ రోజు అర్జున్ ఇంటికి రాడు.

దేవుని విగ్రహాలు చోరీ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు కనుక ఆ ముఠా అర్జున్‌ను చంపేసి ఉంటారని పోలీసులు డిసైడ్ అవుతారు.

కుమారుడిని హత్య చేసిన వాళ్ళపై పగ తీర్చుకోవాలని రజనీ వెళతాడు. ఆ జర్నీలో ఏం జరిగింది? అనేది మిగతా సినిమా.

'జైలర్'లో రజనీ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్లు, డార్క్ కామెడీ ఉన్నాయి. ఆయన కూడా వన్ మ్యాన్ షో చేశారు. యాక్టింగ్ సూపర్.

'జైలర్' ఫస్టాఫ్‌ చూస్తే సూపర్ హిట్ అనిపిస్తుంది. సెకండాఫ్ చప్పగా సాగుతుంది. ఆ ఫీల్ అంతా పోతుంది.

రజనీ ఇమేజ్‌పై అతిగా ఆధారపడి కథపై కాన్సంట్రేట్ చేయలేదు నెల్సన్ దిలీప్ కుమార్. అది మైనస్ అయ్యింది.

సెకండాఫ్‌లో తమన్నా ట్రాక్, ఫ్లాష్‌బ్యాక్ సినిమాకు పెద్ద మైనస్. మళ్ళీ క్లైమాక్స్ వరకు కోలుకోలేదు.

అనిరుధ్ నేపథ్య సంగీతం రజనీ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.

'జైలర్' ఫస్టాఫ్ హిట్టు, సెకండాఫ్ ఫట్టు! రజనీ హీరోయిజం ఎంజాయ్ చేయడానికి అయితేనే ఓకే.