ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యల 'బేబీ' ఎలా ఉంది? స్టోరీ, ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? కథ : ఆనంద్, వైష్ణవి స్కూల్ ఏజ్ లవర్స్. టెన్త్ ఫెయిలై అబ్బాయి ఆటో డ్రైవర్ అయితే, అమ్మాయి బీటెక్ చేరుతుంది. ఆనంద్‌ను ప్రేమిస్తున్నా అంటూనే కాలేజీలో పరిచయమైన విరాజ్‌తో రొమాన్స్ వరకు వెళుతుంది వైష్ణవి. ఆనంద్, విరాజ్... ఇద్దరిలో వైష్ణవి ఎవర్ని ప్రేమించింది? ఒకరి గురించి మరొకరికి తెలిశాక అబ్బాయిలు ఏం చేశారనేది కథ. ఎలా ఉంది? కథ, క్యారెక్టర్లు చూస్తే... లోపాలు చాలా ఉన్నాయ్! కానీ, సీన్లు స్ట్రాంగ్‌గా రాశారు సాయి రాజేష్. అమ్మాయిలను వాడుకున్న, వాళ్ళ చేతిలో మోసపోయిన అబ్బాయిలు ఇద్దరూ ఉన్నారు. 'బేబీ' కూడా ఉన్నారు. వార్తల్లో స్కూల్, కాలేజ్ ప్రేమకథలే 'బేబీ'లో ఉన్నాయ్! టీనేజ్‌లో యువత చేసే తప్పులే 'బేబీ' కథ. 'బేబీ'లో నిడివి ఎక్కువైంది. క్యారెక్టర్లకు సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు. కొన్ని సీన్లు సాగదీశారు. బోర్ కొడతాయి. విజయ్ బుల్గానిన్ పాటలు, నేపథ్యం సంగీతం సూపర్బ్. హీరో హీరోయిన్లు చక్కగా చేశారు. కొన్ని డైలాగులకు క్లాప్స్ కొడతారు. 'బేబీ' చూసేటప్పుడు యువత ఏదో ఒక పాత్రతో కనెక్ట్ అవుతారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ మ్యూజికల్ చిత్రమిది.