టామ్ క్రూజ్, మిషన్ ఇంపాజిబుల్ సినిమాలకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. మరి, ఈ సిరీస్‌లో వచ్చిన సినిమా ఎలా ఉందంటే? సముద్రంలో మునిగిన రష్యన్ సబ్ మెరైన్‌లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ 'ది ఎంటిటి' సోర్స్ కోడ్ ఉంటుంది. 'ది ఎంటిటి'ని కంట్రోల్ చేసే 'కీ' కోసం ట్రై చేసే వాళ్ళ ప్రయత్నాలకు ఇథన్ హంట్ (టామ్ క్రూజ్) అడ్డు తగులుతాడు. 'కీ' కోసం టామ్ క్రూజ్ ఏం చేశాడు? అతడికి ఎవరు అడ్డు తగిలారు? ఎవరు సపోర్ట్ చేశారు? అనేది సినిమా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం అనేది ఈ కథలో కొత్త పాయింట్. కథలో అసలు విషయాన్ని రెండో పార్ట్ కోసం దాచేశారు. మొదటి పార్ట్ ను యాక్షన్ సీన్లకు పరిమితం చేశారు. రోమ్ రోడ్స్ మీద ఛేజ్, బైక్‌తో టామ్ క్రూజ్ దూకే సీన్, ట్రైన్ ఎపిసోడ్... కేక. యాక్షన్ సీన్లు అన్నీ సూపర్బ్. టామ్ క్రూజ్ టాప్ లేపేశారు. సినిమాలో మెయిన్ హైలైట్ ఆయనే. విజువల్స్, మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. కథ, కథనం స్క్రీన్ ప్లే రొటీన్ అయినా ఊపిరి బిగబట్టి చూసేలా యాక్షన్ సీన్లను తీయడంలో టీం సక్సెస్ అయ్యింది. టామ్ క్రూజ్ కోసం, ఆ యాక్షన్ సీన్స్ కోసం అయినా సరే 'మిషన్ ఇంపాజిబుల్ 7'ను చూడాలి.