యాక్షన్ మూవీ ఫ్రాంచైజీల్లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్’కు మంచి క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో 10వ సినిమా ‘ఫాస్ట్ X’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంతంగా జీవిస్తున్న డొమినిక్ టొరెట్టో (విన్ డీజిల్) కుటుంబంలో అనుకోని కుదుపులు వస్తాయి. వాటికి కారణమైన వ్యక్తి (జాసన్ మోమోవా) ఎవరు? డొమినిక్ గతంలో చేసిన మిషన్‌కి, ఈ వ్యక్తికి సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సిరీస్ సినిమాలకు ప్రధాన బలం అందులో ఉండే అన్ రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌లు. కథ పెద్దగా లేకపోయినా వీటి కారణంగానే భారీ కలెక్షన్లను ఈ సిరీస్ సాధిస్తుంది. ఇందులో కూడా కళ్లు చెదిరే యాక్షన్ సీన్లు ఉన్నాయి. అవే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఏబీపీ దేశం రేటింగ్ : 3/5